Geetha Bhagat : ఈ యాంకర్ గురించి తెలుసా? సుమక్క లాగే పద్దతిగా దూసుకుపోతూ..
ఇటీవల మరో యాంకర్ కూడా వరుస ఈవెంట్స్ తో పద్దతిగా కనిపిస్తూ సరదాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతుంది. తనే యాంకర్ గీతా భగత్..

Anchor Geetha Bhagat Busy with Movie Events Promotional Interviews
Geetha Bhagat : ఏ కార్యక్రమం మొదలవ్వాలన్నా, ఏ ఈవెంట్ సాఫీగా ఎంటర్టైన్మెంట్ తో సాగాలన్నా యాంకర్ ఉండాల్సిందే. సినీ, టీవీ పరిశ్రమలో ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు. అయితే ఇటీవల చాలా మంది యాంకర్స్ స్కిన్ షో చేస్తూ, హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది యాంకర్లు స్టేజి మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వెకిలి జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. కానీ అతి తక్కువ మంది యాంకర్లు పద్దతిగా డ్రెస్సులు వేస్తూ, కార్యక్రమాన్ని చక్కని ఎంటర్టైన్మెంట్ తో నడిపిస్తారు.
అలాంటి యాంకర్స్ లో మనకు ముందు గుర్తుకు వచ్చేది సుమ గారే. సుమక్క యాంకరింగ్ అంటే కూల్ గా సాగిపోతుంది. కానీ ఇటీవల మరో యాంకర్ కూడా వరుస ఈవెంట్స్ తో పద్దతిగా కనిపిస్తూ సరదాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతుంది. తనే యాంకర్ గీతా భగత్.. ఇటీవల ఏ సినిమా ఈవెంట్ చూసినా తనే యాంకర్ గా కనిపిస్తుంది. కెరీర్ మొదట్లో సినిమాల్లో కూడా నటించిన గీతా భగత్ ప్రస్తుతం ఫుల్ టైం యాంకర్ గా మారిపోయారు.
View this post on Instagram
Also Read : Geetha Bhagat : ప్రసన్నవదనం ఈవెంట్లో.. యాంకర్ గీత భగత్ క్యూట్ ఫొటోలు..
ఓ వైపు మూవీ ఈవెంట్లు, మరోవైపు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, ఇంకో వైపు కబడ్డీ లీగ్ లు.. చేస్తూ దూసుకుపోతుంది గీతా భగత్. స్టేజిపై సరదాగా మాట్లాడుతూ, మధ్యమధ్యలో పంచులు వేస్తూ అందర్నీ నవ్విస్తూ తన మాటలతో ఎవ్వర్నీ నొప్పించకుండా అందర్నీ మెప్పిస్తుంది గీతా భగత్. ఇక డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా హద్దులు దాటకుండా ప్రతి ఈవెంట్, ఇంటర్వ్యూలో పద్దతిగా కనిపిస్తూ అలరిస్తుంది. రీసెంట్ టైంలో సుమక్క తర్వాత ఆ రేంజ్ లో అంతే పద్దతిగా వరుసగా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేసేది ఎవరైనా ఉన్నారంటే అది గీతా భగత్ మాత్రమే. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తాను చేసే వర్క్ అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్, ఫ్యాన్స్ ని కూడా పెంచుకుంటుంది.
View this post on Instagram
View this post on Instagram