Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

Nama Nageshwar Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

Pawan Kalyan: పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన పవన్ కల్యాణ్ (ఫొటో గ్యాలరీ)

రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా ఆయనపై నమోదైన కేసులో ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్లించినట్లుగా ఈసీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఆస్తుల జప్తులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఈడీ అటాచ్ చేసింది. అలాగే హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్థులను కూడా ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పేరుతో రుణాలు తీసుకుని, వాటిని దారి మళ్లించారని ఈడీ పేర్కొంది.

Chandrababu Calls Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఫోన్.. కేసులు, అరెస్టులపై ఆగ్రహం

మొత్తం రూ.361.29 కోట్లు దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. నామా నాగేశ్వర రావుతోపాటు, నామా సీతయ్య అధీనంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.