Chhattisgarh : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు హతం.. 10కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

Chhattisgarh : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు హతం.. 10కి చేరిన మృతుల సంఖ్య

Narayanpur Encounter (Image Source : Google)

Chhattisgarh : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 30న) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. రాష్ట్రంలోని నారాయణపూర్ పోలీస్ ఫోర్స్, మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సీసీ మెంబర్, డీవీసీ సభ్యుడు హతమైనట్టు సమాచారం. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని అబుజ్‌మడ్‌లోని పెక్‌మేటాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఘటనా స్థలిలో భారీ మొత్తంలో మావోయిస్టుల వస్తువులు, ఆయుధాలు, తుపాకులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ రాబిన్‌సన్ గురియా ధృవీకరించారు. మహారాష్ట్ర సరిహద్దులోని టేకేమాటా సమీపంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు-మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ మృతిచెందినవారి సంఖ్య 10కి చేరింది.

పోలీసుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మరికొంత మంది నక్సలైట్లు మృతిచెందే అవకాశం ఉంది. మరోవైపు.. నారాయణ‌పూర్ సమీప ప్రాంతాల్లోనూ పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల జేసీబీ మెషిన్‌తో నేలను తవ్వి
బంకర్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, రేషన్, కంప్యూటర్ సెటప్, మందులు, జేసీబీ యంత్రం లభ్యమయ్యాయి.

Read Also : విజయవాడ డాక్టర్ ఫ్యామిలీ డెత్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు