Amit Shah: నా ఫేక్ వీడియో వెనుక ఆయన హస్తం ఉంది: అమిత్ షా

కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Amit Shah: నా ఫేక్ వీడియో వెనుక ఆయన హస్తం ఉంది: అమిత్ షా

Amit Shah

ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై కొందరు తన ఫేక్ వీడియోను షేర్ చేయడం పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియో షేర్ వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉందని అన్నారు. అధికారం లేకపోవడంతో దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని, నిరాశలో తన ఫేక్ వీడియో షేర్ చేస్తున్నారని అమిత్ షా అన్నారు.

ఫేక్ వీడియో ప్రచారాలు ఎప్పుడూ ఇంతలా జరగలేదని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టో ఆధారంగా రాహుల్ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ కాదని అన్నారు. అసోం గువాహటి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అమిత్ షా ఫేక్ వీడియో, నిజమైన వీడియోలను చూపారు.

కాగా, కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వీడియో ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ నేతలు ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని, దీని వల్ల ఎత్తున హింసకు కారణమయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.

Also Read: భారత్ సూపర్‌పవర్ కావాలనుకుంటుంటే.. మన దేశమేమో..: పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆసక్తికర కామెంట్స్