Amazon Year end Sale: అమెజాన్ లో “ఇయర్ ఎండ్” డిస్కౌంట్ సేల్ లో టాప్ స్మార్ట్ ఫోన్స్

ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2021కి గానూ "year end sale" ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు అందిస్తుంది అమెజాన్.

Amazon Year end Sale: అమెజాన్ లో “ఇయర్ ఎండ్” డిస్కౌంట్ సేల్ లో టాప్ స్మార్ట్ ఫోన్స్

Amazon Year End Sale

Amazon Year end sale: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 2021కి గానూ “year end sale” ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు అందిస్తుంది అమెజాన్. ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంకు/క్రెడిట్ కార్డు ఆధారిత డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ డిస్కౌంట్స్ మేళా డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. రెడ్మి, షావోమి, శాంసంగ్, రియల్ మీ, వన్ ప్లస్ సహా అనేక స్మార్ట్ ఫోన్లు డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్లో ఉన్న టాప్ ఫోన్స్, వాటి వివరాలు చూస్తే,
1. శాంసంగ్ గెలాక్సీ M52 5G: శాంసంగ్ M52 5G అమెజాన్ సేల్ లో రూ.29000లకు లభిస్తుంది. ఫోన్ పై రూ.2500 డిస్కౌంట్ ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా మరో రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు EMIలో కొనాలనుకునేవారికి రూ.1412 నెలవారి చెల్లింపుతో లభిస్తుంది.
2. వన్ ప్లస్ Nord 2 5G: వన్ ప్లస్ Nord 2 5G స్మార్ట్ ఫోన్ రూ.29999 ధరతో అమెజాన్ సేల్ లో ఉంది. ఈ ఫోన్ పై ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు రూ. 2000 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు అంతేకాదు, వినియోగదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజి చేయడంతో గరిష్టంగా రూ.16,950 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
3. వన్‌ప్లస్ Nord CE 5G: వన్‌ప్లస్ నోర్డ్ CE 5G స్మార్ట్ ఫోన్, రూ. 24,999 సేల్ తో అమెజాన్ లో లభిస్తుంది. ఈపైన ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు రూ. 1500 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు అంతేకాదు, వినియోగదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజి చేయడంతో గరిష్టంగా రూ.16,950 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Also Read: Top Bikes in India: ఇండియాలో రూ.3 లక్షల లోపు టాప్ బైక్ లు ఇవే
4. రెడ్‌మీ నోట్ 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత అమెజాన్ సేల్ లో రూ.14,999 ధరకు లభిస్తుంది. ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్నవారు రూ.1000ల డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర క్రెడిట్ కార్డులున్నవారు సైతం, బ్యాంకు నుంచి వచ్చే డిస్కౌంట్ కి అర్హులు. వినియోగదారులు తమ పాత ఫోన్ ఎక్స్చేంజి చేయడంతో గరిష్టంగా రూ.13,950 వరకు బోనస్ కూడా పొందవచ్చు.
5. షియోమి 11 Lite NE 5G: షియోమి 11 లైట్ NE 5G అమెజాన్ డిస్కౌంట్ సేల్ లో లభిస్తుంది. ప్రస్తుతం రూ. 24,500లుగా ఉన్న ఈ ఫోన్, ICICI బ్యాంకు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లో లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు ఉన్నవారు, ఈషియోమి 11 లైట్ NE 5G ఫోన్ పై నేరుగా రూ. 2500 డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్ ఎక్స్చేంజి చేయదలిచిన వినియోగదారులకు ఈ ఫోన్ రూ.19950కే వస్తుంది.
మరి ఈ డిస్కౌంట్లతో మీకు ఇష్టమైన ఫోన్ కొనుక్కుని ఈ 2022 నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకండి.

Also Read: Best Software Jobs: 2022లో అత్యధిక జీతం అందించే “టెక్ ఉద్యోగాలు” ఇవే