Best Software Jobs: 2022లో అత్యధిక జీతం అందించే “టెక్ ఉద్యోగాలు” ఇవే

సరైన విద్యా కోర్సులు నేర్చుకుని సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లాలనే వారికి ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉద్యోగాలకు లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి.

Best Software Jobs: 2022లో అత్యధిక జీతం అందించే “టెక్ ఉద్యోగాలు” ఇవే

Jobs

Updated On : December 28, 2021 / 5:46 PM IST

Best Software Jobs: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపని చేయాలన్న సాంకేతికత సహాయం లేనిదే సాధ్యపడడంలేదు. ప్రస్తుత కోవిడ్ సమయంలో అది మరింత రుజువైంది. సాఫ్ట్ వేర్ రంగం విప్లవాత్మక మార్పులవైపు పరుగెడుతోంది. మార్పులను గమనించి సాంకేతికతను అందిపుచ్చుకుంటే సాఫ్ట్ వేర్ రంగంలో రాణించవచ్చు. సరైన విద్యా కోర్సులు నేర్చుకుని సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లాలనే వారికి ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఉద్యోగాలకు లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ వైపు వెళ్లాలనుకునే వారికి ఏఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఆయా కోర్సులు నేర్చుకునేందుకు ఎటువంటి అర్హతలు ఉండాలో చూద్దాం.

1. డేటా సైంటిస్ట్
మెరుగైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కంపెనీలకు సహాయపడే డేటాను విశ్లేషించడం, ప్రాసెస్ చేయడం మరియు మోడలింగ్ చేయడం వంటి వాటికి సంబంధించిన పనులపై డేటా సైంటిస్టులు పనిచేస్తారు. రాబోయే పదేళ్లలో 31% వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 20 వృత్తులలో ఈ డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు ఒకటి. ఎక్కువ జీతం, అద్భుతమైన వృద్ధి అవకాశాలు కోరుకునేవారు ఈ కెరీర్ ను ఎంచుకోవచ్చు. డేటా సైంటిస్ట్ యొక్క సగటు జీతం INR 7-10 లక్షలు ఉంటుంది. డేటా సైంటిస్ట్ కావడానికి ఈ క్రింది నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి:

– ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్
– మ్యాథ్స్ స్కిల్స్
– మెషిన్ లెర్నింగ్
– డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ మరియు అనేక ఇతర నైపుణ్యాలు.

2. ఫుల్ స్టాక్ డెవలపర్
ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే అప్లికేషన్ యొక్క ఫ్రంట్ ఎండ్ లేదా క్లయింట్ వైపు మరియు బ్యాకెండ్ లేదా సర్వర్ వైపు రెండింటిలోనూ పనిచేసే వ్యక్తి. ఇటీవలి ఉద్యోగ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా, ఫుల్ స్టాక్ డెవలపర్‌లకు రానున్న రోజుల్లో 20% డిమాండ్‌ ఉంది. దాదాపు INR 8 లక్షల సగటు జీతంతో ఫుల్ స్టాక్ డెవలపర్ భారతదేశంలో అత్యధికంగా చెల్లించే జాబ్స్ లలో ఒకటి. ఫుల్ స్టాక్ డెవలపర్‌ కు ఈ క్రింది నైపుణ్యాలు ఉండాలి:
– HTML మరియు CSS
– జావాస్క్రిప్ట్
– Git మరియు GitHub
– బ్యాకెండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్
– ఫ్రేమ్‌వర్క్‌లు, వెబ్ ఆర్కిటెక్చర్
– డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ మొదలైనవి.

3. బ్లాక్‌చెయిన్ ఇంజనీర్
భవిష్యత్ అంతా బ్లాక్‌చెయిన్ ఆధారంతోనే ఉంటుందని టెక్ పండితులు చెబుతున్నారు. బ్లాక్‌చెయిన్ ఇంజనీర్లు ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ కోసం డిజిటల్ బ్లాక్‌చెయిన్‌ను రూపొందించడం, అమలు చేయడం మరియు విశ్లేషించడం వంటి వాటిలో పని చేస్తారు. మిగతా డెవలపర్‌ల కంటే 50 -100% అధిక జీతాలు మరియు గణనీయమైన వృద్ధి రేటుతో బ్లాక్ చైన్ ఇంజనీర్ ఉద్యోగం ప్రస్తుతం అత్యధిక డిమాండ్ లో ఉంది. బ్లాక్‌చెయిన్ ఇంజనీర్ సరాసరి జీతం INR 8 లక్షలుగా ఉంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్ / బ్లాక్‌చెయిన్ ఇంజనీర్ కావడానికి మీరు
– క్రిప్టోగ్రఫీ
– డేటా స్ట్రక్చర్‌లు
– అల్గారిథమ్‌లు
– కంప్యూటర్ నెట్‌వర్కింగ్
– డిసెంట్రలైజ్డ్ అప్లికేషన్‌లు మొదలైన వాటి వంటి నైపుణ్యాలు కలిగి ఉండాలి.

Also Read: Solar Power: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఐఐటీ గుహాటీ కీలక పరిశోధన

4. డెవాప్స్ ఇంజనీర్(DevOps)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు DevOps-సంబంధిత సాంకేతికతలకు మారుతున్నాయి. డెవాప్స్ ఇంజనీర్లు, సంస్థలోని డెవలప్‌మెంట్ & ఆపరేషన్స్ రెండింటిపైనా పనిచేయవచ్చు. కోడింగ్, డెవలపర్స్ మరియు ఇతర టెక్నికల్ ఆపరేషన్స్ నిర్వహించడానికి డెవాప్స్ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. వీరు సంస్థలో డెవలపర్‌లు మరియు ఇతర ఐటీ నిపుణుల బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. 2020లో డెవాప్స్ ఇంజనీర్ల జీతం INR 4-5 లక్షలుగా ఉండగా 2021లో అది INR 7-8 లక్షలకు పెరిగినట్లు ప్రముఖ జాబ్ పోర్టల్స్ పేర్కొన్నాయి. DevOps ఇంజనీర్ కావడానికి మీరు ఈక్రింది నైపుణ్యాలను కలిగి ఉండాలి:
– ప్రోగ్రామింగ్ నాలెడ్జ్
– సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ & డిప్లాయ్‌మెంట్
– CI/CD పైప్‌లైన్‌ల అవగాహన
– ఆటోమేషన్ టూల్స్
– నెట్‌వర్కింగ్ & సెక్యూరిటీ
– ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు మొదలైనవి.

5. సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
గతంలో కంటే ఇప్పుడు సైబర్‌ సెక్యూరిటీ చాలా ముఖ్యం. సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు ప్రాథమికంగా కంపెనీల డేటాను హ్యాకర్‌ల నుండి సైబర్ దాడుల నుండి రక్షిస్తారు. కస్టమర్‌ల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లకుండా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు పనిచేస్తారు. నేపుణ్యమున్న సెక్యూరిటీ స్పెషలిస్ట్‌ల బృందం లేకుండా, సంస్థలు పనిచేయలేవు. డేటా ఉల్లంఘనల కారణంగా కంపెనీలు భారీ మొత్తంలో డబ్బును కోల్పోయే ప్రమాదం. మున్ముందు రోజుల్లో టెక్నాలజీఅంతా డేటా ఆధారితం కానునందునా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల అవసరం చాలా ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జీతం సరాసరి INR 6-7 లక్షలు ఉండగా 2022లో అది 35 శాతం మేర పెరగొచ్చని వృత్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్టులకు కావాల్సిన నైపుణ్యాలు
– ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్
– IT సెక్యూరిటీ పరిజ్ఞానం
– గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్
– కంప్యూటర్ ఫోరెన్సిక్స్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు ఉండాలి
ఏదో ఒక కోర్స్ నేర్చుకుని సాఫ్ట్ వేర్ వైపు వెళ్లాలనుకునే వారు ఈ ఐదు వృత్తి నైపుణ్యాలు నేర్చుకుని మంచి జీతాలు అందుకోవచ్చు.

Also Read: Special car for PM Modi: ప్రధాని మోదీ రూ.12 కోట్ల విలువైన కారు ప్రత్యేకతలు ఇవే!