Bride And Groom Hookah Kiss : ఇదేం పైత్యం రా నాయనా..! పెళ్లి మండపంపైనే పొగ తాగుతూ లిప్‌కిస్ పెట్టిన వధువు.. వీడియో వైరల్

Bride And Groom Hookah Kiss : ఇదేం పైత్యం రా నాయనా..! పెళ్లి మండపంపైనే పొగ తాగుతూ లిప్‌కిస్ పెట్టిన వధువు.. వీడియో వైరల్

Updated On : May 26, 2023 / 4:29 PM IST

Bride And Groom Hookah Kiss : ఏదో ఒకటి చేసేయాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి. ఓవర్ నైట్ లో ఫుల్లుగా పబ్లిసిటీ, పాపులారిటీ వచ్చేయాలి. ఇదీ.. నేటి యువత తీరు. పాపులారిటీ మోజులో కొందరు యువత పిచ్చి పనులు చేస్తున్నారు. క్రేజీగా చేసేయాలనే తొందరలో వెర్రి వేషాలతో విమర్శల పాలవుతున్నారు.

ఇటీవలి కాలంలో వివాహ సమయాల్లో ఇలాంటివి మరీ ఎక్కువయ్యాయి. తమ పెళ్లి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొందరు డిఫెరెంట్ పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తొందరలో పిచ్చి చేష్టలతో నవ్వుల పాలవుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read.. Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్

ఓ పెళ్లి జంట వేదికపైనే హుక్కా తాగుతూ ముద్దు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముందుగా.. అందరి ముందే హుక్కా పీల్చిన వధువు.. వరుడికి లిప్ కిస్ ఇచ్చింది. వరుడి నోట్లో నోరు పెట్టి పొగను ఊదింది. కిస్ తర్వాత వరుడు మళ్లీ ఆ పొగను బయటకి వదిలాడు. పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, వీడియో వైరల్ అయ్యింది. అదే సమయంలో ఆ జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read.. Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

పెళ్లి మండంపై అంతా చూస్తుండగానే హుక్కా పీల్చడం ఏంటి? వరుడికి లిప్ కిస్ ఇచ్చి ఆ పొగను అతడి నోట్లో ఊదడం ఏంటి? పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో, ఇదేం పైత్యం రా నాయనా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. పాపులర్ అయ్యేందుకు ఈ జంట ప్లే చేసిన ట్రిక్, చూపిన క్రియేటివిటీ.. పరమ చండాలంగా ఉందని కొందరు తిట్టిపోశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.