Fighting In Ghaziabad: రోడ్డుపై ఘర్షణ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిన కారు.. యాక్సిడెంట్ అయినా ఆగని గొడవ.. వీడియో వైరల్

రోడ్డుపై గొడవ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిందో కారు. ఆ గ్యాంగ్‌లో ఇద్దరిని ఢీ కొంది. వాళ్లు కింద పడ్డారు. అయినా ఆ గొడవ ఆగలేదు. కిందపడ్డ వాళ్లు లేచిన వెంటనే తిరిగి గొడవ పడటం ప్రారంభించారు.

Fighting In Ghaziabad: రోడ్డుపై ఘర్షణ పడుతున్న కుర్రాళ్లపైకి దూసుకొచ్చిన కారు.. యాక్సిడెంట్ అయినా ఆగని గొడవ.. వీడియో వైరల్

Fighting In Ghaziabad: కొంతమంది కుర్రాళ్లు రోడ్డుపై గుమిగూడి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. వాళ్లపైకి వేగంగా దూసుకొచ్చిందో కారు. ఈ కారు ఇద్దరిని ఢీకొంది కూడా. అయినా ఆ ఘర్షణ ఆగలేదు. పైగా కారు ఢీకొట్టిన ఇద్దరూ వెంటనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రకారం.. రహదారిపై కొంతమంది కుర్రాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. చాలా మంది గుంపులుగా గొడవ పడుతున్నారు. అప్పుడే ఒక కారు వేగంగా వారి పైకి దూసుకొచ్చింది. అది గమనించి అందరూ తలో దిక్కు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దూరంగా వెళ్తున్న ఇద్దరిపైకి దూసుకొచ్చింది కారు. ఇద్దరు కుర్రాళ్లను ఢీకొనడంతో వాళ్లు కింద పడ్డారు. అయితే, కింద పడ్డ యువకుల్లో ఒక కుర్రాడు లేవగనే వేరే గ్యాంగ్ అతడిపై దాడికి దిగింది.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

అతడు కూడా వారిపై ఎదురు దాడి చేశాడు. కారు ఢీకొని కిందపడ్డా కూడా వారి ఘర్షణ ఆగలేదు. మిగతావాళ్లు కూడా ఒకరిపై ఒకరు అలాగే దాడి చేసుకున్నారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.