Chandigarh University: తోటి విద్యార్థినుల నగ్నవీడియోలు తీస్తూ ఆన్‭లైన్‭లో అప్‭లోడ్.. ఇప్పటికే 60కి పైగా.. అట్టుడికి పోతున్న యూనివర్సిటీ

పంజాబ్‭లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్‭లైన్‭లో అప్‭లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల దృష్టికి రావడంతో తోటి విద్యార్థి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక ఆన్‭లైన్‭లో తమ వీడియోలు చూసుకున్న విద్యార్థినులు తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.

Chandigarh University: తోటి విద్యార్థినుల నగ్నవీడియోలు తీస్తూ ఆన్‭లైన్‭లో అప్‭లోడ్.. ఇప్పటికే 60కి పైగా.. అట్టుడికి పోతున్న యూనివర్సిటీ

Girls Hostel Videos Leaked Protest In Chandigarh University

Chandigarh University: పంజాబ్‭లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక విద్యార్థిని తన సహ విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ ఒక వ్యక్తికి పంపించింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను ఆన్‭లైన్‭లో అప్‭లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త విద్యార్థినుల దృష్టికి రావడంతో తోటి విద్యార్థి చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక ఆన్‭లైన్‭లో తమ వీడియోలు చూసుకున్న విద్యార్థినులు తీవ్ర మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.

Odisha: మల్కాన్‭గిరిలో లొంగిపోయిన 700కు పైగా నక్సల్ సానుభూతిపరులు

ఈ విషయమై శనివారం అర్థరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిందితురాలిపై రిజిస్ట్రార్‭కు ఇచ్చిన ఫిర్యాదులు ఫలించలేదని, ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితురాలైన విద్యార్థిని మొహాలి నివాసి అని, ఆదివారం ఉదయం ఆమెను అరెస్ట్ చేసి, సదరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా, ఆ విద్యార్థి తీసిన వీడియోలను పరీక్ష నిమిత్తం ఫోరెనిక్స్ విభాగానికి పంపినట్లు పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ విషయమై పెద్ద ఎత్తున దుమారం లేసేలాగే కనిపిస్తోంది. ఇప్పటికే చండీగఢ్ యూనివర్సిటీ పరిసరాలు అట్టుడికిపోతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది విద్యార్థులు యూనవర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి నుంచి నిరసన నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని, ఈ విషయంపై చట్టం ప్రకారం నడుచుకుంటామని హామీ ఇచ్చారు.

Gujarat: ఎన్నికల ముందు ప్రభుత్వంపై మాస్ నిరసనకు దిగిన వేలాది ఉద్యోగులు

కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ట్విట్టర్‭లో అయితే #chandigarhuniversity అనే హ్యాష్‭ట్యాగ్ టాప్ ట్రెండింగ్‭లో ఉంది. యూనివర్సిటీ యాజమాన్యంపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితురాలిని చర్యను ఖండిస్తూ అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరిస్తున్నారు.

దీనికి ముందు నిందితురాలిపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‭కు బాధిత విద్యార్థినిలు సహా, ఇతర విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఆయన సరైన స్థాయిలో స్పందించలేదట. అంతే కాకుండా నిందితురాలిని హాస్టల్ వార్డెన్ ప్రశ్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు ఎందుకు తీశావని నిందితురాలిని ప్రశ్నించగా.. ఒక వ్యక్తి తనపై తీవ్ర ఒత్తిడి రావడంతో ఈ వీడియోలు తీయాల్సి వచ్చిందని నిందితురాలు పేర్కొనడం గమనార్హం.

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి