Gujarat: ఎన్నికల ముందు ప్రభుత్వంపై మాస్ నిరసనకు దిగిన వేలాది ఉద్యోగులు

ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ‘‘మా ప్రధాన డిమాండ్ అయిన పాత పెన్షన్ విధానం అమలు ఇంకా పరిష్కారం కాలేదు. శుక్రవారం ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వస్తుందని ఆశించాం. కానీ అది జరగలేదు. ఇది అన్ని రంగాల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకే ఈరోజు నిర్వహించిన నిరసనలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు’’ అని శనివారం ఆందోళన సందర్భంగా పేర్కొన్నారు.

Gujarat: ఎన్నికల ముందు ప్రభుత్వంపై మాస్ నిరసనకు దిగిన వేలాది ఉద్యోగులు
ad

Gujarat: సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు మెరుపు నిరసనకు దిగారు గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాస్ క్యాజువల్ లీవ్ పేరుతో శనివారం చేపట్టిన వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవు ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. ఐక్య సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పిలుపుకు దిగినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

అయితే ఉద్యోగుల పలు డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే కీలకమైన పాత పెన్షన్ విధానంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వనందు వల్లే నిరసన చేపట్టినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అతి ఎక్కువగా భావ్‭నగర్ జిల్లాలో 7,000 మంది ప్రభుత్వ టీచర్లు, కచ్ జిల్లాలో 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు శనివారం నాటి ఆందోళనలో పాల్గొన్నారు. టీచర్లు, పంచాయతీ ఆరోగ్య కార్యకర్తలు, రెవెన్యూ ఉద్యోగులు ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ విషయమై ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ‘‘మా ప్రధాన డిమాండ్ అయిన పాత పెన్షన్ విధానం అమలు ఇంకా పరిష్కారం కాలేదు. శుక్రవారం ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వస్తుందని ఆశించాం. కానీ అది జరగలేదు. ఇది అన్ని రంగాల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకే ఈరోజు నిర్వహించిన నిరసనలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు’’ అని శనివారం ఆందోళన సందర్భంగా పేర్కొన్నారు.

Odisha: మల్కాన్‭గిరిలో లొంగిపోయిన 700కు పైగా నక్సల్ సానుభూతిపరులు