Odisha: మల్కాన్‭గిరిలో లొంగిపోయిన 700కు పైగా నక్సల్ సానుభూతిపరులు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరి కార్యకలాపాలు కొనసాగాయని.. పౌరులు, భద్రతా దళాలపై జరిగిన పలు దాడులు, హత్యలో వీరి హస్తముందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొన్ని నక్సల్ నెట్‭వర్క్ కీలక ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. ‘‘వందల సంఖ్యలో నక్సల్స్, వారి సానుభూతి పరులు లొంగిపోయారు. మావోయిస్ట్ భావజాలంతో నక్సల్స్‭గా మారిన వీరు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జరిగే కార్యకలాపాల్లో చాలా కాలంగా పాల్గొంటున్నారు.

Odisha: మల్కాన్‭గిరిలో లొంగిపోయిన 700కు పైగా నక్సల్ సానుభూతిపరులు

Over 700 active Maoist supporters surrender in Odisha Malkangiri

Odisha: ఒడిశా రాష్ట్రంలో నక్సల్ సానుభూతి పరులు వందల సంఖ్యలో లొంగిపోయారు. మల్కాన్‭గిరి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్‭లో సుమారు 700 మందికి పైగా నక్సల్స్, నక్సల్స్ సానుభూతిపరులు లొంగిపోయినట్లు ఆంద్రహల్ బీఎస్ఎఫ్ క్యాంప్, మల్కాన్‭గిరి పోలీసులు ఆదివారం ప్రకటించారు. కాగా, లొంగిపోయిన వారిలో 300 మంది ఆంద్రహల్ జిల్లాలోని భజగూడ, బైసిగూడ, ఖల్జగూడ, పత్రపుత్, ఒందేపడర్, సంబల్‭పూర్, సింధిపుత్.. రంగ్‭బెల్ జిల్లాలోని పడల్‭పుత్, కుసుంపుత్, మఠంపుత్, జోడిగుమ్మ గ్రామాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరి కార్యకలాపాలు కొనసాగాయని.. పౌరులు, భద్రతా దళాలపై జరిగిన పలు దాడులు, హత్యలో వీరి హస్తముందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొన్ని నక్సల్ నెట్‭వర్క్ కీలక ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. ‘‘వందల సంఖ్యలో నక్సల్స్, వారి సానుభూతి పరులు లొంగిపోయారు. మావోయిస్ట్ భావజాలంతో నక్సల్స్‭గా మారిన వీరు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు జరిగే కార్యకలాపాల్లో చాలా కాలంగా పాల్గొంటున్నారు. పలువురు పౌరులు, భద్రతా దళాల మరణాల్లో వీరి హస్తం ఉంది. అనేక ఆపరేషన్లలో వీరు పాల్గొన్నారు’’ అని పోలీసులు తెలిపారు.

అయితే నూతనాభివృద్ధిలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మించడంతో పాటు మెడికల్ సదుపాయాలు కల్పించడం, మొబైల్ టవర్లు నెలకొల్పడం, ప్రతి ఇంటికి తాగునీటి వసతులు కల్పించడం, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా నక్సల్ సానుభూతి పరులను మోటివేట్ చేశామని, అవి మంచి ఫలితాలను ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Hazaribag: జార్ఖండ్‭లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు, 8 మంది మృతి