Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

గల్స్ హాస్టల్‌లో అమ్మాయిలకు సంబంధించిన వీడియోల్ని రహస్యంగా చిత్రీకరించాడు ఒక స్వీపర్. అమ్మాయి స్నానం చేసేటప్పుడు, సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుండగా దొరికిపోయాడు.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

Kanpur Hostel: ఇటీవలే చండీఘడ్‌లో ఒక యువతి.. హాస్టల్‌లోని విద్యార్థినిల వీడియోలు చిత్రీకరించిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లోని ఒక గల్స్ హాస్టల్‌లో స్వీపర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి, అక్కడి అమ్మాయిల వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు.

Bigg Boss 6: రేవంత్‌కు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్.. ఎమోషనల్ అయిన సింగర్!

ఈ విషయాన్ని గుర్తించిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక తులసి నగర్‌లోని ఒక గల్స్ హాస్టల్‌లో 60 మందికిపైగా అమ్మాయిలు ఉంటున్నారు. నీట్‌‌తోపాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హాస్టల్‌లో రిషి అనే వ్యక్తి దాదాపు ఏడేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ అమ్మాయిలకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు తీశాడు. గత గురువారం ఒక వీడియో తీస్తుండగా అమ్మాయి గుర్తించింది. అమ్మాయి స్నానం చేస్తుండగా, బాత్‌రూమ్ డోర్‌కు సంబంధించి పగిలిపోయిన ప్రదేశంలో రహస్యంగా మొబైల్ ఫోన్ ఉంచి అతడు వీడియో తీశాడు.

Adipurush Teaser Poster: ‘ఆదిపురుష్’ టీజర్ పోస్టర్.. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ.. టెర్రిఫిక్!

అమ్మాయి ఆ విషయాన్ని గుర్తించింది. సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా గుర్తించి, స్వీపర్‌ను నిలదీయగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై హాస్టల్ బాలికలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మరికొందరు అమ్మాయిల వీడియోలు కూడా ఇలాగే తీసినట్లు వారు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు అమ్మాయిలు నిరసనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.