Adipurush Teaser Poster: ‘ఆదిపురుష్’ టీజర్ పోస్టర్.. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ.. టెర్రిఫిక్!

యావత్ ఇండియన్ సినీ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తూ ఇండియన్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు.

Adipurush Teaser Poster: ‘ఆదిపురుష్’ టీజర్ పోస్టర్.. రాముడిగా ప్రభాస్ ఎంట్రీ.. టెర్రిఫిక్!

Prabhas As Rama In Adipurush Teaser Poster Revealed

Adipurush Teaser Poster: యావత్ ఇండియన్ సినీ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ ఎపిక్ మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసినప్పటి నుండీ, ఆయన రాముడిగా ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు.

#AdipurushTeaser : దసరా పండగకు రాముడొస్తున్నాడు.. ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్.. జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్..

ఇక వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆదిపురుష్ చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమా నుండి టీజర్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తూ ఇండియన్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు. ఆకాశానికి బాణం ఎక్కుపెట్టిన రాముడిగా ప్రభాస్ టెర్రిఫిక్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఇది దుమ్ములేపుతోంది. కాగా, రాముడిగా తమ అభిమాన హీరోను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.

Adipurush: “ఆదిపురుష్” మీ అంచనాలకు మించి ఉండబోతుంది.. ప్రభాస్ శ్రీను!

అటు ఈ సినిమా టీజర్, రిలీజ్ డేట్ వివరాలను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆదిపురుష్ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 2న సాయంత్రం 7.11 గంటలకు అయోధ్యలోని సరయు నది ఒడ్డున రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోండగా, లంకేశ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఓం రావుత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.