#AdipurushTeaser : దసరా పండగకు రాముడొస్తున్నాడు.. ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్.. జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్..

ఓం రౌత్ ప్రభాస్, కృతి సనన్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..''మా మ్యాజికల్ జర్నీ ఇప్పుడు మీ అందరిది. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ అక్టోబర్ 2న..............

#AdipurushTeaser : దసరా పండగకు రాముడొస్తున్నాడు.. ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్.. జోష్ లో ప్రభాస్ ఫ్యాన్స్..

#AdipurushTeaser : ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే సినిమాల్లో ప్రభాస్ ఆదిపురుష్ ఒకటి. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. సినిమా ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతున్నారు. ఆదిపురుష్ సినిమాపై అప్డేట్స్ ఇవ్వమని సోషల్ మీడియాలో ఓం రౌత్ ని అడుగుతున్నారు. ఇక ఓం రౌత్ బయట ఎక్కడ కనపడినా అందరూ అడిగేది ఒకటే ప్రశ్న ఆదిపురుష్ అప్డేట్ ఎప్పుడు అని. అంతలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. గత కొన్ని రోజులుగా దసరా పండగకి ఆదిపురుష్ నుంచి టీజర్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ అధికారికంగా దీనిపై ప్రకటన చేశారు.

Adipurush: “ఆదిపురుష్” మీ అంచనాలకు మించి ఉండబోతుంది.. ప్రభాస్ శ్రీను!

ఓం రౌత్ ప్రభాస్, కృతి సనన్ తో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”మా మ్యాజికల్ జర్నీ ఇప్పుడు మీ అందరిది. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్ అయోధ్యలో సరయు నది ఒడ్డున రిలీజ్ చేయబోతున్నాము. అలాగే ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 3D, ఐమ్యాక్స్ ఫార్మెట్ లలో కూడా విడుదల కానుంది” అని పోస్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Om Raut (@omraut)