Leopard Enters House: వామ్మో.. నేరుగా ఇంట్లోకొచ్చిన చిరుత పులి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

మహారాష్ట్ర సతారాలోని కోయానగర్ ప్రాంతంలో ఓ కుటుంబం గురువారం రాత్రి ఇంటికి వచ్చిన చిరుత పులిని చూసి భయంతో వణికిపోయారు. కొద్దిసేపటికి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిరుతను బోనులో బంధించి తీసుకెళ్లారు.

Leopard Enters House: వామ్మో.. నేరుగా ఇంట్లోకొచ్చిన చిరుత పులి.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

Leopard Enters Maharashtra House

Leopard Enters House: మహారాష్ట్రలో ఓ కుటుంబానికి షాకింగ్ ఘటన ఎదురైంది. దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు చిరుతపులి స్వాగతం పలికింది. కళ్లముందు చిరుతపులిని చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు అక్కడినుంచి పరుగు తీశారు.

Women Passengers Fight: ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళా ప్రయాణికుల ఫైటింగ్.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని సతారాలోని కోయానగర్ ప్రాంతంలో ఓ కుటుంబం గురువారం రాత్రి ఇంటికి వచ్చిన చిరుత పులిని చూసి భయంతో వణికిపోయారు. చిరుత పులి ఇంట్లోని గది తలుపు పక్కన కూర్చొని ఉంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. ఇంటిచుట్టూ చేరి కిటికీల నుంచి చిరుతపులి వీడియోలను తీశారు. చిరుత బయటకు వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే అటూఇటూ తిరుగుతూ ఉండిపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కుటుంబ సభ్యులు చిరుత పులి సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి బోను సహాయంతో చిరుతను బంధించి తీసుకెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.