Oil Steal From Running Train : వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయనా.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ చోరీ, ఎలా కొట్టేస్తున్నారో చూడండి..

దొంగలు రెచ్చిపోయారు. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ కొట్టేశారు. చేతిలో బకెట్ తో రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు తీస్తూ ఆయిల్ పట్టుకున్నారు దొంగలు.

Oil Steal From Running Train : వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయనా.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ చోరీ, ఎలా కొట్టేస్తున్నారో చూడండి..

Oil Steal From Running Train : బాబోయ్.. బీహార్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వాళ్లు మామూలుగా రెచ్చిపోవడం లేదు. అసలు దేన్నీ వదలడం లేదు. చాన్స్ చిక్కితే చాలు అన్నీ దోచేస్తున్నారు. రోడ్లు, బ్రిడ్జ్ లు, టవర్లు, ట్రైన్లే కాదు.. అంతకు మించి అన్నట్టుగా చోరీలకు పాల్పడుతన్నారు. ఇప్పుడు అక్కడి దొంగల కన్ను ట్రైన్లలో ట్రాన్స్ పోర్ట్ అయ్యే ఆయిల్ ట్యాంకర్ల పై పడింది.

బీహార్ లో కొందరు దొంగలు బరితెగించారు. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ కొట్టేశారు. ఓ గూడ్స్ రైలు ఆయిల్ ట్యాంకర్లతో వెళ్తోంది. ఆ ఆయిల్ ను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఆయిల్ డిపోకు తరలించాల్సి ఉంది. అయితే, గూడ్స్ రైలు ఓ బ్రిడ్జి వద్దకు రాగానే.. దొంగలు రెచ్చిపోయారు. ట్యాంకర్లను విప్పి, ఆయిల్ ను బకెట్లలో పట్టుకున్నారు. ట్రైన్ రన్నింగ్ లో ఉండగానే.. వారిలా ఆయిల్ ను చోరీని చేసేశారు. కాగా, ఈ తతంగాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. అంతే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read..Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

ఆయిల్ ట్యాంకర్లతో కూడిన రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది. ఇంతలో ఇద్దరు ముగ్గురు దొంగలు.. చేతిలో బకెట్లతో రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు పెడుతున్నారు. ఓ వ్యక్తి ట్రైన్ నుంచి ఆయిల్ ను తన బకెట్ లో పట్టుకుంటున్నాడు. ఇదంతా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంది.

ఆ బ్రిడ్జి వద్దకు రాగానే ట్రైన్ స్లో అవుతుందని ముందుగానే తెలుసుకున్న దొంగలు.. ప్రీ ప్లాన్డ్ గా బక్కెట్లతో మాటువేశారు. ఆయిల్ ట్యాంకర్లతో కూడిన ట్రైన్ బ్రిడ్జి వద్దకు రాగానే తమ పని మొదలు పెట్టారు. ట్రైన్ రన్నింగ్ లో ఉండగానే.. ట్యాంకర్లు విప్పి ఆయిల్ ను డబ్బాల్లో పట్టుకున్నారు. రన్నింగ్ గూడ్స్ రైలు ట్యాంకర్ల నుంచి ఆయిల్ చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయనా అని నివ్వెరపోతున్నారు.

Also Read..Rajasthan Chain Snatch : షాకింగ్ వీడియో.. షాపింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ ఎలా లాక్కెళ్లాడో చూడండి..

ఇదే కాదు.. బీహార్ లో జరుగుతున్న చోరీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జనాలకు దిమ్మతిరిగిపోతోంది. ఏకంగా రైలు ఇంజిన్ నే ఎత్తుకెళ్లారు దొంగలు. అంతేనా.. మరో చోట.. ఏకంగా 45ఏళ్ల క్రితం నాటి బ్రిడ్జిని కూడా ఎత్తుకెళ్లారు. ఇలా.. వీరి దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.