Rajasthan Chain Snatch : షాకింగ్ వీడియో.. షాపింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ ఎలా లాక్కెళ్లాడో చూడండి..

బికనీర్ లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రెప్పపాటులో మహిళ మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు.

Rajasthan Chain Snatch : షాకింగ్ వీడియో.. షాపింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ ఎలా లాక్కెళ్లాడో చూడండి..

Updated On : November 27, 2022 / 11:12 PM IST

Rajasthan Chain Snatch : దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లోనే కాదు పట్టపగలు కూడా బరితెగిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లోనే కాదు జనం రద్దీగా ఉంటే ప్లేసుల్లోనూ ఎంతో ఈజీగా చోరీలకు పాల్పడుతున్నారు. రెప్పపాటులో దొంగతనం చేసి జారుకుంటున్నారు. తాజాగా రాజస్తాన్ లోని బికనీర్ లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రెప్పపాటులో మహిళ మెడ నుంచి గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు.

బికనీర్ లో ఓ మహిళ తన బాబుతో కలిసి బండి మీద షాపుకి వచ్చింది. షాపు ముందు బండిలో కూర్చుని సరుకులు కొంటోంది. ఆమెకు కాస్త వెనుకే ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఆ వ్యక్తి ముఖాన్ని కర్చీఫ్ తో కవర్ చేశాడు. ఏదో పని మీద అక్కడ వెయిట్ చేస్తున్నట్లు వాడు బిల్డప్ ఇచ్చాడు.

Also Read : Murder With Fevi Quick : దారుణం.. తన ముందు శృంగారం చేయాలన్న తాంత్రికుడు, ఆ తర్వాత వారి ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపేశాడు

కాసేపు అటు ఇటు చూసిన ఆ చైన్ స్నాచర్.. మహిళ కొట్టు యజమానితో మాట్లాడుతుండగా.. అదను చూసుకుని ఆమె వెనుక నుంచి ఆమె మెడలోని చైన్ ను లాగేసుకుని పరారయ్యాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే చైన్ స్నాచర్ అక్కడి నుంచి పారిపోయాడు. షాక్ కి గురైన యువతి కాసేపటి తర్వాత.. బైక్ పైనుంచి దిగి.. చైన్ స్నాచర్ వెనుక పరిగెత్తింది.

ఈ చైన్ స్నాచింగ్ మొత్తం షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. పట్ట పగలే జరిగిన చైన్ స్నాచింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ బండి మీద ఉండటం, ముందర ఆమె బాబు ఉండటం.. చైన్ స్నాచర్ కు ప్లస్ అయ్యాయి. ఈజీగా చైన్ చోరీ చేయగలిగాడు. కాగా, ఈ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజెప్పే ఘటన ఇది. మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

Also Read : Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..