Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

ఉత్తరప్రదేశ్ లో బంగారం షాపులో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీర కట్టులో వచ్చిన ఓ పెద్దావిడ.. ఎంతో చాకచక్యంగా జస్ట్ 20 సెకన్ల వ్యవధిలో రూ.10 లక్షలు విలువ చేసే గోల్డ్ నెక్లెస్ ను కొట్టేసింది. ఆమె చోరీ చేసిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

Theft In Gold Shop : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అరటిపండు తిన్నంత ఈజీగా చోరీలు చేస్తున్నారు. షాపులో ఎంతమంది సిబ్బంది ఉన్నా, ఎంత నిఘా ఉన్నా.. రెప్పపాటులో దొంగతనాలు చేసేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో షాకింగ్ చోరీ జరిగింది. గోల్గర్ ప్రాంతంలోని ఓ బంగారం షాపులో జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీర కట్టులో వచ్చిన ఓ పెద్దావిడ.. ఎంతో చాకచక్యంగా జస్ట్ 20 సెకన్ల వ్యవధిలో రూ.10 లక్షలు విలువ చేసే గోల్డ్ నెక్లెస్ ను కొట్టేసింది. ఆమె చోరీ చేసిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ముఖానికి మాస్క్, నల్ల కళ్ల జోడు పెట్టుకున్న 45ఏళ్ల ఓ మహిళ నవంబర్ 17న గోల్గర్ ప్రాంతంలోని ఓ గోల్డ్ షాపుకి వెళ్లింది. ఆ సమయంలో షాపులో బాగా రద్దీగా ఉంది. తనకు నగలు చూపించాలని ఆమె సిబ్బందిని అడిగింది. దీంతో సిబ్బంది ఆమెకి పలు రకాల గోల్డ్ నెక్లెస్ లు చూపించారు. ఆ నెక్లెస్ లు వేర్వేరు బాక్సుల్లో ఉన్నాయి.

Also Read : Delhi: కాంగ్రెస్ మహిళా నేత కారు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డైన ఘటన.. సిగ్గుచేటు పని అన్న నేత

ఆభరణాలు చూస్తున్నట్లు ఆమె యాక్ట్ చేసింది. ఇంతలో అదను చూసి, షాపు వాళ్లకు ఏమాత్రం డౌట్ రాకుండా ఓ నగల బాక్స్ పై మరో నగల బాక్స్ ఉంచింది. దుకాణ యజమాని సహా సిబ్బంది అక్కడే ఉన్నా రెప్పపాటు సమయంలో గోల్డ్ నెక్లెస్ ఉన్న కింద డబ్బాను చీర చాటున దాచేసింది. ఓ హ్యాండ్ బ్యాగ్ ను ఆ డబ్బాకు అడ్డుగా పెట్టేసింది. ఆ తర్వాత పైనున్న బాక్స్ ను టేబుల్ మీద పెట్టేసింది. తనొచ్చిన పనయ్యాక.. తనకు ఆభరణాలేవీ నచ్చలేదంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.

Also Read : Thieves Rob Train Engine : ఏకంగా రైలింజన్నే ఎత్తుకెళ్లిన దొంగలు

కాసేపటి తర్వాత రూ.10లక్షల విలువైన నెక్లెస్ పోయిందని గుర్తించిన యజమాని కంగారుపడ్డాడు. ముందుగా షాపులో పని చేసే వారిని అనుమానించాడు. తర్వాత సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అతడికి దిమ్మతిరిగిపోయిది. ఓ పెద్దావిడ తన చీర చాటున గోల్డ్ నెక్లెస్ దాచేయడం కనిపించింది. దీని ఆధారంగా ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలో అందరి కళ్లుగప్పి గోల్డ్ నెక్లెస్ ను ఆ మహిళ చోరీ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఓ మై గాడ్.. అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.