Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

Viral Video : రోడ్డు మీద వెళ్లేటప్పుడు, మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్లే చాలావరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

Road Accident (Photo : Google)

Shocking Road Accident : రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, అలసత్వంగా ఉన్నా.. ప్రాణాలకే ప్రమాదం. రోడ్డు మీద వెళ్లేటప్పుడు, మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్లే చాలావరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. తాజాగా డెహ్రాడూన్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. స్కూటీని బస్సు ఢీకొట్టడంతో.. మహిళ స్పాట్ లోనే మరణించింది.

Also Read..Viral Video : మహిళలూ బీకేర్ ఫుల్.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

డెహ్రాడూన్ నెహ్రూ కాలనీ పరిధిలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. హరిద్వార్ బైపాస్ దగ్గర ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ స్పాట్ లోనే మరణించింది. యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మృతురాలి పేరు ప్రీతి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోంది. ఇంటి నుంచి యూనివర్సిటీకి స్కూటీపై బయలుదేరింది. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో ఘోరం జరిగిపోయింది. స్కూటీ నడుపుతున్న ప్రీతి.. ముందు వెనకా చూసుకోకుండా అలానే రోడ్డు మీదకు వెళ్లిపోయింది.

రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నంలో వాహనాలు రావడంతో కాస్త స్లో అయ్యింది. ఇంతలో రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన బస్సు బలంగా స్కూటీని ఢీకొట్టింది. దాంతో స్కూటీ సహా ప్రీతి దూరంగా వెళ్లి రోడ్డు పై పడింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ యాక్సిడెంట్ ను కళ్లారా చూసిన వారు షాక్ అయ్యారు. వాహనాలతో రోడ్డు ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసే సమయంలో. ముందు వెనకా చూసుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించకతప్పదని చెప్పేందుకు ఈ యాక్సిడెంటే నిదర్శనం.

Also Read.. Viral Video : ఘోర ప్రమాదం.. బస్సులోంచి జారిపడ్డ యువతి, అక్కడికక్కడే మృతి