Groom Nose Small : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

Groom Nose Small : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలే.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

Groom Nose Small : పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడనో, పొట్టిగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయోనో లేకు అతడి బ్యాక్ గ్రౌండ్ బాగోలేదనో.. వధువులు పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటనలు చూసి ఉంటాము, అలాంటి వార్తలు చదివుంటాము. ఇందులో పెద్ద వింతేమీ లేదు. ఇది కామనే. కానీ, అంతకుమంచి అన్నట్టుగా.. వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ వధువు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేయడం చూశారా? కనీసం విన్నారా? అవును నిజమే. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందనే కారణంతో ఓ పెళ్లి కూతురు పెళ్లినే రద్దు చేసేసింది.

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చింది. అప్పటికే పెళ్లి కూతురు ఇంటి దగ్గర జనం చేరారు. అందులో ఉన్న కొందరు మహిళల దృష్టి పెళ్లి కొడుకు ముక్కు మీద పడింది. అంతే, అతడి ముక్కు గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందని వారంతా అనుకుంటుండగా.. ఆ మాటలు పెళ్లి కూతురు చెవిన పడ్డాయి.

Also Read..Bride And Groom Hookah Kiss : ఇదేం పైత్యం రా నాయనా..! పెళ్లి మండపంపైనే పొగ తాగుతూ లిప్‌కిస్ పెట్టిన వధువు.. వీడియో వైరల్

అంతే, పెళ్లి కూతురు ఏమనుకుందో ఏమో కానీ, నాకీ పెళ్లి వద్దు, క్యాన్సిల్ అనేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ నివ్వెరపోయింది. ఎందుకమ్మా పెళ్లి వద్దన్నావు అంటే, వరుడి ముక్కు చిన్నగా ఉంది, నాకు నచ్చలేదు ఆమె చెప్పడంతో పెళ్లి కొడుకు, అతడి కుటుంబసభ్యులకు దిమ్మ తిరిగిపోయింది.

కాగా, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా.. పెళ్లి కూతురు వినిపించుకోలేదు. పెళ్లి క్యాన్సిల్ అంతే.. అని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. మేము నిమిత్త మాత్రులం అని చేతులు దులుపుకున్నారు. పోలీసులే చేతులెత్తేయడంతో.. ఇక చేసేదేమీ లేదని తెలుసుకున్న వరుడి ఫ్యామిలీ.. అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగింది.

Also Read..UP bridegroom: తనకు కట్నంగా ఇచ్చిన రూ.11 లక్షలు, బంగారాన్ని తిరిగి ఇచ్చేసిన పెళ్లి కొడుకు

వరుడి ముక్కు చిన్నదా ఉందని ఎవరో అన్నారని, వధువు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు విస్తుపోతున్నారు. పెళ్లి కూతురి తీరుతో నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదంటున్నారు. ఆమె వైఖరి మరీ కామెడీగా ఉందంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.