Mangaluru : ఘోర ప్రమాదం.. అదుపుతప్పిన బైక్, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు, స్పాట్‌లో మృతి.. ఒళ్లుగగుర్పొడిచే రోడ్ యాక్సిడెంట్

అతివేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పింది. రోడ్డు మీదున్న పోల్ ను ఢీకొట్టింది. అంతే, బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. (Mangaluru Road Accident)

Mangaluru : ఘోర ప్రమాదం.. అదుపుతప్పిన బైక్, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు, స్పాట్‌లో మృతి.. ఒళ్లుగగుర్పొడిచే రోడ్ యాక్సిడెంట్

Mangaluru Road Accident (Photo : Google)

Mangaluru Road Accident : అతివేగం అత్యంత ప్రమాదకరం. అత్యంత ప్రాణాంతకం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ఊరికే అనలేదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. అతివేగం కారణంగా ఎన్నో రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంకా కొందరిలో మార్పు రాకపోవడం శోచనీయం. అతి వేగంగా వాహనాలు నడిపి చావు కొనితెచ్చుకుంటున్నారు.

Also Read..Viral Video : షాకింగ్.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన టూరిస్టుపై కర్రలు, రాడ్లతో దాడి.. వదిలేయమని ప్రాథేయపడినా దారుణంగా కొట్టారు

తాజాగా కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైక్ అదుపుతప్పింది. రోడ్డు మీదున్న పోల్ ను ఢీకొట్టింది. అంతే, బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు.

Also Read..Delhi : ప్రేమించాడని.. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే దారుణ హత్య

మంగళూరులో ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ చోటు చేసుకుంది. 21ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ సడెన్ గా అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పోల్ ను బలంగా ఢీకొట్టింది. అంతే, బైక్ మీదున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.

సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో వాహనాలు గాల్లోకి ఎగిరటం చూసే ఉంటారు. కానీ, ఇక్కడ రియల్ గా అలాంటి ప్రమాదం జరిగింది. యువకుడు గాల్లోకి ఎగరడం చూస్తే.. బైక్ ను ఎంత వేగంగా నడుపుతున్నాడో అర్థమవుతుంది. మృతుడిని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అడయార్ సహ్యాద్రి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.