Delhi : ప్రేమించాడని.. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే దారుణ హత్య, ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ప్రేమించిన పాపానికి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. అమ్మాయి కుటుంబసభ్యులు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. (Delhi)

Delhi : ప్రేమించాడని.. పట్టపగలు నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే దారుణ హత్య, ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Delhi Man Stabbed To Death(Photo : Google)

Delhi – Man Stabbed To Death : దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకే మర్డర్లు చేస్తున్నారు. గన్నులు, కత్తులు, కర్రలు, రాళ్లతో యథేచ్చగా దాడులకు తెగబడుతున్నారు. నడిరోడ్డుపైనే పబ్లిక్ లో ఖూనీలు చేస్తున్నారు. మనిషి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. ఎంతో ఈజీగా హత్యలు చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

ఇక, ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమించడం పాపంగా మారుతోంది. ప్రేమించిన పాపానికి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. అమ్మాయి కుటంబసభ్యులు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. తమ అమ్మాయిని ప్రేమించాడని అమ్మాయి తండ్రి, సోదరులు కలిసి ప్రియుడిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు.

ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారం ప్రాణం తీసింది. బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన సల్మాన్ (25) అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమ అమ్మాయి కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం లేదు. ఈ క్రమంలో అబ్బాయిపై కసి పెంచుకున్నారు. అదను చూసి హత్య చేశారు.

Also Read..Viral Video : షాకింగ్.. తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన టూరిస్టుపై కర్రలు, రాడ్లతో దాడి.. వదిలేయమని ప్రాథేయపడినా దారుణంగా కొట్టారు

సోమవారం జాఫ్రాబాద్ ప్రాంతంలో సల్మాన్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో బైక్ పై వెళ్తున్నాడు. ఇంతలో యువతి సోదరులు, తండ్రి.. ప్రియుడు సల్మాన్ పై సడెన్ గా అటాక్ చేశారు. పదునైన ఆయుధంతో కసితీరా పొడిచారు. దాంతో బైక్ పై నుంచి సల్మాన్ రోడ్డుపై పడిపోయాడు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తితో పలు మార్లు విచక్షణారహితంగా పొడిచారు.

తీవ్ర గాయాలతో సల్మాన్ స్పాట్ లోనే చనిపోయాడు. అదే సమయంలో అక్కడ రోడ్డుపై కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు. కానీ, వారెవరూ అడ్డుకునే సాహసం మాత్రం చేయలేదు. ఈ హత్యను కళ్లారా చూసి వారంతా భయాందో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉంది. కాగా, సల్మాన్ పై దాడి చూసి అతడి వెంట ఉన్న ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు.

Also Read..Dalit Girl Gang-Raped : దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్.. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకం

”సల్మాన్ తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. ఇంతలో అమ్మాయి కుటుంబసభ్యులు అతడికి అడ్డు వచ్చారు. సల్మాన్‌పై యువతి తండ్రి, సోదరులు కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. ఈ దాడిలో సల్మాన్ మెడ, ఛాతిపై బలమైన గాయాలయ్యాయి. దాంతో అతడు స్పాట్ లోనే మరణించాడు. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాకు చిక్కింది. సల్మాన్ యువతితో రెండేళ్లుగా స్నేహం చేస్తున్నాడు. యువతి తండ్రి మంజూర్, సోదరుడు మోసిన్ కు ఇది ఇష్టం లేదు. హత్య తర్వాత నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటాం” అని పోలీసులు వెల్లడించారు.