Spiderman Thief : ఓ మై గాడ్.. స్పైడర్ మ్యాన్‌లా నిమిషంలోపే నాలుగంతస్తుల బిల్డింగ్ ఎక్కేసిన దొంగ.. వీడియో వైరల్

Spiderman Thief : అచ్చం స్పైడర్ మ్యాన్ లా చకచకా బిల్డింగ్ ఎక్కేసి నివ్వెరపోయేలా చేశాడు. అంతే స్పీడ్ గా కిందకు కూడా వచ్చేశాడు. దాంతో అంతా షాక్ అవుతున్నారు.

Spiderman Thief : ఓ మై గాడ్.. స్పైడర్ మ్యాన్‌లా నిమిషంలోపే నాలుగంతస్తుల బిల్డింగ్ ఎక్కేసిన దొంగ.. వీడియో వైరల్

Spiderman Thief(Photo : Google)

Spiderman Thief : స్పైడర్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో విన్యాసాలకు కొదవే ఉండదు. ఎంతో ఈజీగా బిల్డింగ్ లు చకచకా ఎక్కేస్తాడు. రెప్పపాటులో జంప్ చేస్తాడు. అయితే, అది సినిమా. రీల్ లైఫ్. రియల్ లైఫ్ లో అది పూర్తిగా అసాధ్యం అనే చెప్పాలి. అలాంటి విన్యాసాలు ఎవరూ చెయ్యరు, చెయ్యలేరు కూడా. అయితే, ఓ దొంగ అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. అచ్చం స్పైడర్ మ్యాన్ లా చకచకా బిల్డింగ్ ఎక్కేసి నివ్వెరపోయేలా చేశాడు.

వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చోరీకి వచ్చిన ఓ దొంగ నాలుగు అంతస్తుల భవనాన్ని స్పైడర్ మ్యాన్ తరహాలో ఎక్కేశాడు. అది కూడా నిమిషం వ్యవధిలోపే. ఆ బిల్డింగ్ కు ఓ పైప్ ఉంది. ఆ పైప్ ను ఆధారంగా చేసుకుని.. ఆ దొంగ నాలుగంతస్తుల భవనాన్ని చకచకా ఎక్కేశాడు. ఆ బిల్డింగ్ కి కాస్త దూరంలో మరో భవనంలో ఉన్న ఓ వ్యక్తి ఇదంతా చూశాడు. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. నువ్వు ఎవరు, ఎందుకు పైకి వెళ్తున్నావు అని నిలదీశాడు. అంతే, ఆ దొంగ బిత్తరపోయాడు.(Spiderman Thief)

Also Read..Viral Video : వారెవ్వా.. చీరలో డ్యాన్స్ ఇరగదీసింది.. నెటిజన్లు ఫిదా.. మీరూ చూసేయండి

దొరిపోయానని భయపడ్డాడో మరో కారణమో కానీ.. వెంటనే ఏ పైప్ ఆధారంగా పైకి వచ్చాడో, మళ్లీ అదే ఆధారంగా చకచకా కిందకి దిగేశాడు. అదీ కూడా సెకన్ల వ్యవధిలోనే. ఆ దొంగ నాలుగంతస్తుల భవనాన్ని ఎక్కడం, దిగడం.. ఇదంతా ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో షూట్ చేశాడు. దాంతో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నివ్వెరపోతున్నారు. స్పైడర్ మ్యాన్ ను గుర్తు చేసుకుంటున్నారు.

అచ్చంగా స్పైడర్ మ్యాన్ తరహాలో ఆ దొంగ నాలుగు అంతస్తుల భవనాన్ని సెక్లన్ల వ్యవధిలో ఎక్కడం, ఆ వెంటనే సెకన్ల వ్యవధిలోనే కిందకు దిగడం చూసి.. ఓ మై గాడ్ అంటున్నారు. మరోవైపు ఆ దొంగ టాలెంట్ ను మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు.(Spiderman Thief)

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం

ఆ బిల్డింగ్ చాలా ఎత్తుగా ఉంది. ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలకే ప్రమాదం. అయితే, ఆ దొంగ చాలా సాహసం చేశాడు. కేవలం పైప్ ఆధారంగా ఎంతో సులువుగా బల్డింగ్ ను ఎక్కేశాడు. ఆ వెంటనే కిందకు దిగేశాడు కూడా. అయితే, అసలు అతడు ఎవరు? దొంగేనా? చోరీ చేసేందుకే వచ్చాడా? దొంగ కాకపోతే మరెవరు? ఎందుకు వచ్చాడు? దేనికోసం పైకి ఎక్కాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.(Spiderman Thief)