Viral Video : వారెవ్వా.. చీరలో డ్యాన్స్ ఇరగదీసింది.. నెటిజన్లు ఫిదా.. మీరూ చూసేయండి

Viral Video : హాట్ హాట్ స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్‌తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో దుమ్ము రేపింది. తగ్గేదేలే అన్నట్లుగా డ్యాన్స్ ప్రదర్శన ఉంది. ఇంకేముందు.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.

Viral Video : వారెవ్వా.. చీరలో డ్యాన్స్ ఇరగదీసింది.. నెటిజన్లు ఫిదా.. మీరూ చూసేయండి

Viral Video(Photo : Google)

Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది. పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం. ఈ తరహా వీడియోల్లో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. వారి డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వారెవ్వా.. ఏమన్నా డ్యాన్స్ చేసిందా అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా అలాంటి డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీరలో ఓ యువతి.. చోలీ కే పీచే క్యా హై అనే బాలీవుడ్ హిట్ సాంగ్ కు చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. ఆమె డ్యాన్స్ చేసిన తీరుకు, ఆమె టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అదరగొట్టేసింది, సూపర్బ్, మెస్మరైజింగ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, స్పీచ్ లెస్ పెర్ఫార్మెన్స్ అని ఆ యువతిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Also Read.. Viral Video: 50 ఏళ్ల వయసులో హుషారుగా దంపతుల డ్యాన్స్

1993లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ఖల్ నాయక్ లో చోలీ కే పీచే క్యా హై సాంగ్ ఉంది. ఈ పాటను అల్కా యాగ్నిక్, అరుణ్ పాడారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆనంద్ భక్షి లిరిక్స్ రాశారు. ఈ పాట ఓ సూపర్ హిట్. ఈ పాటనే ఆ యువతి సెలెక్ట్ చేసుకుంది.

ఆమె పేరు కనికా గోపాల్. ఫేర్ వెల్ లో భాగంగా స్టేజ్ పై డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేసింది. స్టెప్పులతో, కిల్లింగ్ లుక్స్ తో, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము రేపింది. తగ్గేదేలే అన్నట్లుగా ఆమె డ్యాన్స్ ప్రదర్శన ఉంది. ఇంకేముందు.. కనికా గోపాల్ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. సూపర్ గా డ్యాన్స్ చేసిందంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

Also Read..Viral Video: ఇండియన్ సినిమా పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియా స్టార్ అయిన మరో పాక్ అమ్మాయి

కనికా ఈ వీడియోను ఏప్రిల్ 3న తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వ్యూస్ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక లక్షల సంఖ్యలో కామెంట్లు, లైకులు వచ్చాయి. తన డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో కనికా గోపాల్ ఫుల్ ఖుషీగా ఉంది. నాలుగేళ్లుగా అనేక పాటలకు డ్యాన్స్ చేశా. కానీ, ఈ పాటకు వచ్చినంత గుర్తింపు దేనికీ రాలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. చివరికి నేను అనుకున్న గుర్తింపు నాకు దక్కింది అని కనికా గోపాల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Kanika (@_kanikagopal)