Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

కొత్తగా కొని ఇంటికి తెచ్చిన కారు పాపం ఆ యజమానికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అపార్ట్‌మెంట్లోకి వచ్చిన మొదటి రోజే ప్రమాదానికి గురైంది. పార్కు చేసి ఉంచిన బైకులపైకి దూసుకెళ్లింది.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

Viral Video: కొత్తగా కొని ఇంటికి తీసుకొచ్చిన కారు అక్కడ పార్కు చేసిన బైకులపైకి దూసుకెళ్లింది. తర్వాత అదుపుతప్పి బోల్తా పడబోయింది. ఈ ఘటన గత గురువారం ముంబైలోని ఒక అపార్టుమెంట్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tiger Killed: 9 మందిని బలిగొన్న పులి.. వేటాడి చంపిన అధికారులు

టాటా నెక్సాన్ కారును ఒక వ్యక్తి కొత్తగా కొని, డ్రైవింగ్ చేస్తూ అపార్ట్‌మెంట్‌కి తీసుకొచ్చాడు. దానికి ముందు భాగంలో పూల దండతో అలంకరించి ఉంది. అప్పుడే పూజ చేయించుకుని ఇంటికి తెస్తున్నట్లుగా ఉంది. కొత్తగా వస్తున్న ఆ కారు కోసం అక్కడి సెక్యూరిటీ గార్డుతోపాటు మరో వ్యక్తి ఎదురు చూస్తున్నారు. కారు కోసం గేట్లు కూడా తెరిచి ఉంచారు. అయితే, నెమ్మదిగా లోపలికి ఎంట్రీ ఇచ్చిన కొత్త కారు.. లోపలికి రాగానే వేగంగా దూసుకెళ్లింది. అక్కడి పార్కింగ్‌లో ఉంచిన బైకులపైకి దూసుకెళ్లింది. ఆ వెంటనే అదుపుతప్పి బోల్తా పడబోయింది.

కానీ, చివరికి ఎలాగో బ్యాలెన్స్ చేసుకుని ఆగిపోయింది. డ్రైవర్ పొరపాటు వల్లే ఇలా జరిగింది. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ఈ వీడియోను వినోద్ కుమార్ అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి లక్షల్లో వ్యూస్, వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి.