Tiger Killed: 9 మందిని బలిగొన్న పులి.. వేటాడి చంపిన అధికారులు

చిన్నారితోసహా తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్న పులిని అధికారులు మట్టుబెట్టారు. ప్రభుత్వ అనుమతితో పులిని చంపేశారు. ఈ ఘటన శనివారం బిహార్‌లో జరిగింది.

Tiger Killed: 9 మందిని బలిగొన్న పులి.. వేటాడి చంపిన అధికారులు

Tiger Killed: 9 మందిని చంపిన పులిని అధికారులు మట్టుబెట్టారు. ఈ ఘటన శనివారం బిహార్‌లో జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లా, బగాహా ప్రాంతంలో ఒక పులి స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసి చంపేసింది.

Vande Bharat Express: మళ్లీ ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు.. ఈ సారి ఎందుకో తెలుసా

గత మూడు రోజుల్లోనే నలుగురిని చంపింది. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పులి దాడి చేసి ప్రజల్ని చంపేస్తుండటంపై అధికారులు స్పందించారు. ఈ అంశంలో పులిని అడ్డుకుని, మనుషుల ప్రాణాలు కాపాడాలంటే పులిని చంపడం ఒక్కటే మార్గమని భావించారు. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిపై పూర్తి సమాచారం అందుకున్న ప్రభుత్వం స్పందించింది. పులిని చంపేందుకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ అనుమతించింది.

Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్

మనుషుల ప్రాణాలను పులి బలి తీసుకుంటోందని, ఇది మానవ నివాసాలకు ప్రమాదమని భావించిన ప్రభుత్వం పులిని చంపేందుకు అధికారులకు అనుమతి మంజూరు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులిని వేటాడి చంపేశారు. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, జంతు ప్రేమికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంపడానికి బదులు పులిని మరో చోటికి తరలించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.