Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్

బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారని చెప్పారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.

Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్

Bandi sanjay slams kcr

Updated On : October 8, 2022 / 4:42 PM IST

Bandi sanjay slams kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఓ స్వామీకి తనకు చెప్పారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పు వెనుక కుట్ర ఉందని కూడా ఆ స్వామీజీ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలలు ఒకసారి కేసీఆర్ నల్లపిల్లితో పూజలు చేస్తారని చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే.

దీనిపై ఇవాళ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారని చెప్పారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్ లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.

మజ్లిస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, తమ పార్టీలో చేరారని, మునుగోడులో ఆయనే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాజగోపాల్ రెడ్డి పేరు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీజేపీ నేడు ప్రకటించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..