BJP Chief: ఎన్నికలకు దూరంగా బీజేపీ.. 2024 వరకు నడ్డానే కమలం బాస్
2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి
JP Nadda May Get Extension In BJP Top Post
BJP Chief: 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే విచిత్రంగా ఎప్పుడైనా ఎన్నికలు జరిగే భారతీయ జనతా పార్టీకి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2020లో జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నది కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగానే (కొంత తతంగం జరిగినా అది నామమాత్రమే). అయితే ఆ సమయంలో ఈ పదవి కాలం ముగిసిన అనంతరం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు. నడ్డా పదవీ కాలం 2023 జనవరి 20తో ముగుస్తుంది.
అయితే దీనికి మరో ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. పార్టీలో గందరగోళం లేకుండా ఉండేందుకు నడ్డానే ఆ ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్షుడిగా ఉంచాలని పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుందట. అంటే ఆయన 2024 మే వరకు లేదంటే అంత కంటే ఎక్కువ కాలం ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. భారతీయ జనతా పార్టీ నియమాల ప్రకారం.. ఒక వ్యక్తి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. పార్టీ అధ్యక్షుడి పదవీ కాలం 3 సంవత్సరాలు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు ముగిసిన అనంతరం 50 శాతం (సగం) రాష్ట్రాల యూనిట్ల అధ్యక్షుల ఎన్నికలు ప్రారంభించవచ్చనే నిబంధన కూడా ఉంది.
జేపీ నడ్డా.. 2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇవి ముగిసిన ఐదు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ వరుస ఎన్నికల నేపథ్యంలో నడ్డా పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా అమిత్ షా పదవీ కాలాన్ని ఇలాగే పొడగించారు. ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ 2019 ఎన్నికలు ముగిసే వరకు పొడగించారు.
