Congress President Poll: అశోక్ గెహ్లాట్‭కు చెక్ పెట్టే యోచనలో అధిష్టానం.. కమలనాథ్‭ను అందుకే పిలిచారా?

రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌తో గెహ్లాట్ సమావేశమై చర్చలు జరిపారు. అయితే తనకు మద్దతుగా రాజీనామా చేసిన వంద మంది ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌ను సీఎంగా ఒప్పుకోవడం లేదని కూడా గెహ్లాట్ తేల్చి చెప్పారు. చర్చల తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పార్టీలో ఐక్యత అతి ముఖ్యమని చెప్పారు

Congress President Poll: అశోక్ గెహ్లాట్‭కు చెక్ పెట్టే యోచనలో అధిష్టానం.. కమలనాథ్‭ను అందుకే పిలిచారా?

Congress high command thinks replace gehlot with kamalnath

Congress President Poll: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‭కు అధిష్టానం చెక్ పెట్టనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తమకు ఎంతో విధేయుడిగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవి బరిలో నిలిపిన అధిష్టానం.. రాజస్తాన్ రాజకీయ హైడ్రామాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తన ప్రత్యర్థి సచిన్ పైలట్‭కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేసేందుకు ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలతోనే గెహ్లాట్ రాజీనామా చేయించడం గాంధీ కుటుంబాన్ని తీవ్ర కోపానికి గురి చేసింది. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి గెహ్లాట్‭ను తప్పించి.. కమలనాథ్‭ను నిలిపే యోచనలో ఉన్నట్లు పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి.

వాస్తవానికి రాజస్థాన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌తో గెహ్లాట్ సమావేశమై చర్చలు జరిపారు. అయితే తనకు మద్దతుగా రాజీనామా చేసిన వంద మంది ఎమ్మెల్యేలు సచిన్‌ పైలట్‌ను సీఎంగా ఒప్పుకోవడం లేదని కూడా గెహ్లాట్ తేల్చి చెప్పారు. చర్చల తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పార్టీలో ఐక్యత అతి ముఖ్యమని చెప్పారు. రాజస్థాన్‌లో తాజా పరిస్థితిపై నివేదికను అధిష్టానానికి అందజేస్తానన్నారు. మరోవైపు గెహ్లాట్ తీరుతో విసిగిపోయిన అజయ్ మాకెన్ ఆయన్ను కలవకుండానే జైపూర్ హోటల్ నుంచి వెళ్లిపోయారని, ఏదైనా ఉంటే ఢిల్లీలోనే మాట్లాడుకుందామని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

ఇక ఈ హైడ్రామాకు తెర దించేందుకు కమల్‌నాథ్‌ను బరిలోకి దింపింది అధిష్టానం. ఈ సమస్య పరిష్కారంతో పాటు మరో బాధ్యతను కూడా ఆయనకు అప్పగించనున్నారు. గెహ్లాట్‭ తీరుతో విసిగిపోయిన అధిష్టానం.. ఆయనకు చెక్ పెట్టేందుకే కమల్‌నాథ్‌ను పిలిచారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేయడం.. దానికి మద్దతుగా గెహ్లాట్ ఉండడం వంటి పరిణామాలతో అధిష్టానమే కాకుండా, పార్టీ వర్కింగ్ కమిటీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గెహ్లాట్‭ను పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ సైతం చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరో విధేయుడైన కమలనాథ్‭ను ఈ కారణంతోనే అధిష్టానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Subramanian Swamy: ఓవైసీ దేశభక్తుడే కానీ జాతీయవాది కాదు.. రెండింటికీ తేడా ఏంటంటే?