TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్టు నడకదారి పునఃప్రారంభం
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..

TTD Temple: శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి.. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గతేడాది నవంబరు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో బండరాళ్ళు పడి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నడక మార్గాన్ని రూ.3.60 కోట్లతో మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు.
ఈ మార్గం గుండా రోజుకు 6 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్ శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని వివరించారు.
Read Also : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా
ఇంజినీరింగ్, కాంట్రాక్టర్లకు సన్మానం :
అనంతరం శ్రీవారి మెట్టు నడక మార్గంలో త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసిన సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రరెడ్డి, ఈరోడ్ కు చెందిన ఆర్ఆర్ బిల్డర్స్ డీజీఎమ్ శ్రీ ఆర్ముగంను చైర్మన్ శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎం.ఎల్.ఏ. శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మొరం శెట్టి రాములు, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, శ్రీనివాస మంగాపురం ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, డీఈ శ్రీ రవిశంకర్ రెడ్డి, అదనపు సీవీఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
- Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల
- Gangamma jatara :శ్రీవారి తోబుట్టువు గంగమ్మ జాతర ప్రత్యేకత..భక్తులు వేసే ప్రతి వేషాల వెనుకున్న అంతరార్థం
- Tirumala VIP Break Darshan : సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-టీటీడీ కీలక నిర్ణయం
- Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు
1Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
2Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
3KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
4Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
5Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
6Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
7Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
8Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
9Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
10Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!