TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా

ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది... టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను విడుదల చేయనున్నట్లు, ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది...

TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా

TTD

Srivari Arjitha Seva Tickets : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతొక్కరూ కోరుకుంటుంటారు. దేశ విదేశాలు, రాష్ట్రాల నుంచి తిరుమలకు భక్తులు విచ్చేస్తుంటారు. గతంలో కరోనా విజృంభించడంతో భక్తులను అనుమతించలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో నిబంధనలు ఎత్తేసింది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు తిరుమలకు విచ్చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకొనేందుకు టికెట్లను తీసుకొనేందుకు భక్తులు క్యూ లైన్ లో పోటెత్తుతున్నారు. ఆన్ లైన్ లో విడుదల చేసే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా.. టీటీడీ ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది. 2022, ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను విడుదల చేయనున్నట్లు, ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని ఇటీవలే టీటీడీ అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read More : TTD : పంచగవ్య ఉత్పత్తులకు ఫుల్ రెస్పాన్స్.. ఈ కామర్స్ ద్వారా విక్రయాలు

కరోనా మహమ్మారి కారణంగా 2020, మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత భక్తులను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ.. స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. సెకండ్ వేవ్ వ్యాప్తితో కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. స్వామి వారి ఆర్జిత సేవలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకపోయింది. భక్తుల కోరిక మేరకు 2020, ఆగస్టు 07వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందించింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ఆర్జిత సేవల పున:ప్రారంభించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఏప్రిల్ 01వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతినిస్తున్నారు.