India vs Pakistan Match: బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు మైదానంలోకి దిగాయంటే నువ్వానేనా అన్నట్లు మ్యాచ్ సాగుతుంది. ఒక్కోసారి ఇరుజట్ల ప్లేయర్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకోవటంకూడా చూశాం.
![India vs Pakistan Match: బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు India vs Pakistan Match: బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు](https://10tv.in/wp-content/uploads/2023/09/Jasprit-Bumrah.jpg)
Jasprit Bumrah
Shahid Afridi Gift To Bumrah: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ప్రతీ బాల్‌ను టీవీలకు అతక్కుపోయి క్రికెట్ అభిమానులు చూస్తుంటారు. అదే ఆసియా కప్ లాంటి టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే ఇక క్రికెట్ అభిమానులకు పండుగే. కానీ, ఆసియా కప్ -2023లో అభిమానులకు నిరాశే ఎదురవుతుంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తాజాగా ఆదివారం సూపర్ -4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో రిజర్వు డే సోమవారంకు మ్యాచ్ వాయిదా పడింది.
IND VS PAK : రిజర్వ్ డేకు భారత్, పాక్ మ్యాచ్.. వరుణుడు కరుణించేనా..?
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు మైదానంలోకి దిగాయంటే నువ్వానేనా అన్నట్లు మ్యాచ్ సాగుతుంది. ఒక్కోసారి ఇరుజట్ల ప్లేయర్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకోవటంకూడా చూశాం. మైదానంలో ఎలా ఉన్నా.. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానం వెలుపల అభిమానుల హృదయాలను దోచుకుంటుంటారు. తాజాగా పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది పాక్, ఇండియా క్రికెట్ అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఈ నెల 4న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తండ్రి అయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా ట్విట్ ద్వారా తెలియజేశాడు.
IND vs PAK : రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన కేఎల్ రాహుల్
బుమ్రా తండ్రి కావడంతో.. పాకిస్థాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది ఆదివారం మ్యాచ్ సమయంలో బుమ్రా వద్దకు వెళ్లాడు. చేతిలో తీసుకెళ్లిన ప్రత్యేకమైన గిఫ్ట్ ను బుమ్రాకు అందించాడు. బుమ్రా గిఫ్ట్‌ను అందుకున్నతరువాత తండ్రి అయినందుకు బుమ్రాకు పాక్ బౌలర్ అభినందనలు తెలిపి, మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాక్ బౌలర్ షాహిద్ తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Shaheen gifted & congratulated Bumrah for becoming a father.
– A beautiful gesture by Shaheen.pic.twitter.com/zYAFcHk2F9
— Johns. (@CricCrazyJohns) September 10, 2023