Dinesh Karthik: “టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నా”

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా దూసుకెళ్లిపోతున్న దినేశ్ కార్తీక్.. టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నానని అంటున్నాడు. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్న డీకే..

Dinesh Karthik: “టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నా”

Du Plesis

Dinesh Karthik: ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా దూసుకెళ్లిపోతున్న దినేశ్ కార్తీక్.. టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నానని అంటున్నాడు. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్న డీకే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి రాగానే చెలరేగిపోతున్నాడు. రూ.5.5కోట్లతో కొనుగోలు చేసిన ధరకు తగిన న్యాయం చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 34బంతుల్లో 66పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

“నాకు చాలా పెద్ద లక్ష్యం ఉంది. అందుకే చాలా కఠినంగా శ్రమిస్తున్నా. దేశం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఉంది. ఇది నా ప్రయాణంలో ఓ భాగం మాత్రమే. ఇండియా జట్టులో స్థానం దక్కించుకోవడం కోసం అన్నీ ట్రై చేస్తున్నా”

“జట్టులో నాతో పాటు ఉన్న వారు చూపిస్తున్న ప్రశాంతత చాలా బాగుంది. ప్రిపరేషన్ నుంచే ప్రశాంతత, స్థాయి వస్తాయి. షెబాజ్ చాలా స్పెషల్ ప్లేయర్. ప్లేయర్ గా తాను అద్భుతాలు చేయగలడు. ఛాలెంజింగ్‌గా బాల్‌ను హిట్ చేయడంలో అతను ప్రత్యేకం” అని కార్తీక్ అన్నాడు.

Read Also: అలా చూస్తే ఎంఎస్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే

ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కార్తీక్ ను ప్రశంసలతోన ముంచెత్తుతున్నాడు. “190 పరుగులు కావాలంటే చాలా స్పెషల్ ఇన్నింగ్స్ కావాలి. ఆ క్రెడిట్ అంతా షెబాజ్, డీకేకు మాత్రం దక్కుతుంది. డీకే ఆడుతున్న తీరు చూస్తుంటే తనను తానే క్రాస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. తన బెస్ట్ పర్‌ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. చాలా స్పష్టంగా, ప్రశాంతంగా కనిపిస్తున్నాడు” అని డు ప్లెసిస్ వివరించాడు.