Home » ap rains
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్_ ఏరియల్_ సర్వే_
శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి.
AP Floods : రాయలసీమలో వరద విలయం - Live Updates
తిరుమల డిజాస్టర్ రికవరీ సెంటర్లోకి వర్షపు నీరు చేరింది. టీటీడీ సర్వర్లు, నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయాయి. తిరుపతి రెండో ఘాట్ రోడ్డులో చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
భారీగా ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలు, వరదలు జిల్లాను వణికిస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.