Home » Palestinian militants
గాజాపై శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాజాలోని హమాస్ తీవ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఓ వైపు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు ఇజ్రాయిల్ దేశానికి అధునాతన ఆయుధాలు సరఫరా చేసే ఒప్పందాన్ని ఖరారు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారు. అయితే హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టే వరకు దాడులు ఆపబోమని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న మారణహోమంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... అమెరికా వైఖరి మాత్రం వేరేలా ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో చైనా, నార్వే చేసిన ప్రతిపాదనకు అమెరికా అభ�