Home » Ridge Gourd Cultivation Information Guide
బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్కు తరలించవచ్చు.
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం: 130 రోజులు దిగుబడి : 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.