Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

Amazon Huge Discounts : అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డీల్‌ అందిస్తోంది. ఈసారి ఇ-కామర్స్ దిగ్గజం 5G ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Amazon Huge Discounts : అమెజాన్‌లో 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

Amazon offering huge discounts on 5G phones

Amazon offering huge discounts on 5G phones : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) 5G ఫోన్‌లపై కొత్త సేల్ ప్రకటించింది. 5G రివల్యూషన్ సేల్‌లో భాగంగా అమెజాన్ అనేక డివైజ్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ అయితే, (Amazon.in)లో ‘అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ స్టోర్’లో 24 నెలల వరకు బెస్ట్ ఆఫర్‌లను పొందవచ్చు.

నో కాస్ట్ EMIని పొందవచ్చు. ‘నో కాస్ట్ EMI స్టోర్’ OnePlus, Samsung, Realme వంటి అగ్ర బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌లను కూడా అందిస్తోంది. ఈ లాంచ్ ఆఫర్‌లు మే 31 వరకు అందుబాటులో ఉంటాయి. డీలర్ల నుంచి అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లతో అమెజాన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్న కొన్ని పాపులర్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టులను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ మోడల్ ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చు.

iQOO 11 5G : ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, అద్భుతమైన 2K E6 AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 49,999, పాత ఫోన్‌పైరూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌, 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

Read Also : Mahindra Thar SUV : 5 డోర్లతో మహీంద్రా థార్ SUV వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

iQOO Neo 6 5G : iQOO Neo 6 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 5G ప్రాసెసర్, 120Hz E4 AMOLED డిస్‌ప్లే, లాంగ్ లైఫ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 24,999, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌‌పై రూ. 2వేలు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

Amazon offering huge discounts on 5G phones

Amazon offering huge discounts on 5G phones

Redmi Note 12 5G : ఈ ఫోన్ 120Hz సూపర్ AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ Snapdragon 4 Gen 1 5G ప్రాసెసర్, హై-క్వాలిటీ కెమెరాను అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 14,999, మీరు రూ. 2వేలు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

Xiaomi 13 Pro : షావోమీ 13 ప్రో ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, 4nm ప్రాసెసర్, అద్భుతమైన 2K 120Hz E6 AMOLED డిస్‌ప్లే, ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ధర రూ. 71,999, రూ. 10వేల ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

OnePlus 10 Pro 5G : ఈ ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌తో వస్తుంది. పెద్ద డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఎక్కువ కాలం మన్నికతో బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 55,499 ఉండగా, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌, 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌ను పొందవచ్చు. 5G టెక్నాలజీ ఫుల్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అన్ని ఆఫర్‌లను పొందాలంటే సరైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.

Read Also : 2023 Komaki TN 95 : యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో కొమాకి TN 95 ఎలక్ట్రిక్ స్కూటర్.. టాప్ స్పీడ్ 85కి.మీ, ధర ఎంతో తెలుసా?