Mahindra Thar SUV : 5 డోర్లతో మహీంద్రా థార్ SUV వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Mahindra Thar SUV : మహీంద్రా & మహీంద్రా నుంచి కొత్త మోడల్ వెహికల్ రాబోతోంది. 2024లో 5 డోర్లతో మహీంద్రా థార్ SUV మోడల్ వచ్చేస్తోంది. ఈ వెహికల్ ఎప్పుడు లాంచ్ కానుంది? ధర ఎంత ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..

Mahindra Thar SUV : 5 డోర్లతో మహీంద్రా థార్ SUV వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Mahindra Thar 5-door launch in India in 2024

Mahindra Thar SUV 5-door launch in India : ప్రముఖ మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra) క్యాలెండర్ ఇయర్ (CY) 2024లో భారత మార్కెట్లో థార్ 5-డోర్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. మహీంద్రా థార్ 5-డోర్ CY23లో దేశంలో ప్రవేశపెట్టబడుతుందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. రాబోయే మోడల్‌కు సంబంధించిన అన్ని ఊహాగానాలకు మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ స్వస్తి ఇస్తూ థార్ 5-డోర్ CY24లో మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

మహీంద్రా Q4, FY23 ఆర్థిక ఫలితాల ప్రకటనలో మీడియా అడిగిన ప్రశ్నలకు జెజురికర్ సమాధానమిచ్చారు. అక్టోబర్ 2020లో భారత మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా థార్ 3-డోర్ల రూపంలో లాంచ్ అయింది. జూన్ మొదటి వారంలో మారుతి సుజుకి జిమ్నీ విడుదల కానుంది. దీనికి పోటీగా మహీంద్రా థార్ 4WD ప్రమాణంతో రానుంది. మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో పాపులర్ ఆఫ్-రోడర్ RWD వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది.

Read Also : Ola Electric GigaFactory : ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగవంతం.. భారత్‌లోనే అతిపెద్దది.. ఇదిగో ఓసారి లుక్కేయండి..!

థార్ మూడు ఇంజన్ ఆప్షన్‌లతో రానుంది. 1.5-లీటర్ D117, CRDe డీజిల్ (117bhp/300Nm), 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్ (130bhp/300Nm), 2.0-లీటర్ mStallion 150 TGDi/350TGDi. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను 6-స్పీడ్ MT కలిగి ఉంటుంది. 2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లను కలిగి ఉన్నాయి. SUV ఇప్పుడు 4WD, RWD ఆప్షన్లను కలిగి ఉంది.

Mahindra Thar 5-door launch in India in 2024

Mahindra Thar SUV 5-door launch in India in 2024

లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా, థార్ పొడవు 3,985mm, వెడల్పు 1,820mm, ఎత్తు 1,855mmతో వచ్చింది. 2,450mm పొడవైన వీల్‌బేస్, 226mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. థార్ అప్రోచ్ యాంగిల్ 41.2 డిగ్రీలు, డిపార్చర్ యాంగిల్ 36 డిగ్రీలు, ర్యాంప్-ఓవర్ యాంగిల్ 26.2 డిగ్రీలు కలిగి ఉంది. ఈ వెహికల్ వేరియంట్‌పై ఆధారపడి, SUV 16-అంగుళాల వీల్స్ లేదా 18-అంగుళాల వీల్స్ కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ ధర రూ. 10,54,500 నుంచి ప్రారంభమై రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Read Also : Honda Car Offers : హోండా సిటీ, అమేజ్ కార్లపై అదిరే ఆఫర్లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైం.. డోంట్ మిస్..!