Apple Diwali Sale : ఆపిల్ దీపావళి సేల్ మొదలైందోచ్.. ఐఫోన్లపై రూ. 7వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Apple Diwali Sale : ఆపిల్ దీపావళి సేల్ (Apple Diwali Sale) నేటి నుంచి (సెప్టెంబర్ 26, సోమవారం) ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఆపిల్ ఇండియా స్టోర్‌ (Apple India Store)లో నిర్వహించనుంది. ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ దీపావళి సేల్ కొనసాగుతుంది.

Apple Diwali Sale : ఆపిల్ దీపావళి సేల్ మొదలైందోచ్.. ఐఫోన్లపై రూ. 7వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Apple Diwali Sale begins today_ Up to Rs 7,000 discount available on iPhone 13, MacBook Air, more

Apple Diwali Sale : ఆపిల్ దీపావళి సేల్ (Apple Diwali Sale) నేటి నుంచి (సెప్టెంబర్ 26, సోమవారం) ప్రారంభమవుతుంది. ఈ సేల్ ఆపిల్ ఇండియా స్టోర్‌ (Apple India Store)లో నిర్వహించనుంది. ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ దీపావళి సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 మోడల్స్‌లో అన్ని ప్రొడక్టులపై కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఆఫర్ నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫెస్టివల్ సేల్ కోసం.. ఆపిల్ ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. HDFC బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో భాగస్వామ్యంతో ఆపిల్ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో కస్టమర్‌లకు రూ. 7,000 వరకు (7 శాతం క్యాష్‌బ్యాక్) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

అన్ని ప్రొడక్టులపై ధరలను కూడా భారీ తగ్గిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్లు బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతటా రూ. 41,900 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్‌లు, మరెన్నో సహా వివిధ వర్గాలలో ఆపిల్ ప్రొడక్టులపై డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. Apple iPhone 14 సిరీస్‌తో సహా అన్ని లేటెస్ట్ ప్రొడక్టులపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది.

Apple Diwali Sale begins today_ Up to Rs 7,000 discount available on iPhone 13, MacBook Air, more

Apple Diwali Sale begins today_ Up to Rs 7,000 discount available on iPhone 13, MacBook Air, more

వాస్తవానికి, iPhone 14 సిరీస్ బేస్ iPhone 14 128GB మోడల్‌కు రూ. 79,900 ధరతో లాంచ్ కానుంది. ఇప్పుడు, మీరు HDFC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి షాపింగ్ చేస్తే.. మీకు కార్ట్‌పై రూ.7000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ మోడల్ ధర రూ.72,900కి తగ్గుతుంది. మీరు ప్రస్తుతం ఐఫోన్ 14ని చౌకైన ధరకే పొందవచ్చు. ఐఫోన్ 14 సిరీస్‌లోని Plus, Pro మోడళ్లపై అదే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 కూడా అదే ఆఫర్ కింద అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఐఫోన్ 13 సిరీస్ ధర రూ. 69,900 వద్ద లభ్యం అవుతుంది.

బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌తో ధర రూ.62,900కి తగ్గుతుంది. ప్రస్తుతం iPhone 13ని కొనుగోలు చేస్తే.. ఫెస్టివల్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Billion Days Sale) లేదా అమెజాన్‌ (amazon great indian festival 2022)కి వెళ్లి మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మ్యాక్‌బుక్స్ (Macbooks), ఎయిర్‌పాడ్‌లు (Airpods), ఐప్యాడ్‌లు (iPads), ఎయిర్‌ట్యాగ్‌ (Air Tags)లు అనేక ఇతర మోడల్‌లు ఆపిల్ ఫెస్టివల్ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. రూ. 41,900 ధర కంటే ఎక్కువ ఉన్న అన్ని ప్రొడక్టులు 7 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో లభిస్తాయి. ఈ ఆఫర్ సేల్ కొనసాగే వరకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple iOS 16.0.2 Update : ఆపిల్ iOS కొత్త అప్‌డేట్.. కొత్త ఐఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ చెక్ చేసుకున్నారా?