Apple iOS 16.0.2 Update : ఆపిల్ iOS కొత్త అప్‌డేట్.. కొత్త ఐఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ చెక్ చేసుకున్నారా?

Apple iOS 16.0.2 Update : ప్రముఖ కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఆపిల్ (Apple) తమ డివైజ్‌ల్లో వినియోగదారులు ఎదుర్కొనే బగ్‌ సమస్యలను ఫిక్స్ చేసేందుకు iOS 16.0.2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్లలో Apple లేటెస్ట్ OS అప్‌డేట్ ప్రవేశపెట్టింది.

Apple iOS 16.0.2 Update : ఆపిల్ iOS కొత్త అప్‌డేట్.. కొత్త ఐఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ చెక్ చేసుకున్నారా?

Apple’s iOS 16.0.2 update fixes bugs_ Check what has been fixed

Apple iOS 16.0.2 Update : ప్రముఖ కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఆపిల్ (Apple) తమ డివైజ్‌ల్లో వినియోగదారులు ఎదుర్కొనే బగ్‌ సమస్యలను ఫిక్స్ చేసేందుకు iOS 16.0.2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్లలో Apple లేటెస్ట్ OS అప్‌డేట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ కొత్త అప్‌డేట్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత వినియోగదారులు బగ్‌ సమస్యలను ఎదుర్కొన్నారు. Apple భారీ OS అప్‌డేట్‌ను రిలీజ్ చేయగా తరచుగా పాప్-అప్ వంటి పలు సమస్యలు ఎదురయ్యాయి. Apple ఇప్పుడు కొత్త అప్‌డేట్‌ iOS 16.0.2 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.

Apple కొత్త అప్‌డేట్ iPhone 14 Pro, iPhone 14 Pro Maxలో కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లతో షూటింగ్ చేస్తున్నప్పుడు కెమెరా వైబ్రేషన్, బ్లర్ ఫొటోలకు బగ్‌ సమస్యలను క్రియేట్ చేస్తుంది. ఆపిల్ iPhone 14 Pro మోడల్‌‌ను Snapchat, Instagram వంటి థర్డ్ పార్టీ యాప్‌లతో ఉపయోగించినప్పుడు హ్యాండ్‌సెట్‌లలోని వెనుక కెమెరా సెటప్ షేకింగ్, సౌండ్స్ చేస్తుందని యూజర్లు ఫిర్యాదు చేశారు. లోకల్ కెమెరా యాప్‌లో ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

Apple’s iOS 16.0.2 update fixes bugs_ Check what has been fixed

Apple’s iOS 16.0.2 update fixes bugs_ Check what has been fixed

రెండో సమస్య.. కొత్త ఫీచర్‌లో బగ్ ఉంది.. యాప్‌లో ఏదైనా పేస్ట్ చేసేందుకు వినియోగదారులకు అనుమతినిస్తుంది. చాలా మంది వినియోగదారులను విసుగు పుట్టించేలా ఉంది. ఐఫోన్‌లో డేటాను కాపీ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా యూజర్ డేటాకు భద్రతా ఫీచర్‌గా ఉంది. మరో యాప్ నుంచి టెక్స్ట్ పేస్ట్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ Allow Pop-Up పాప్ అప్ విండో వస్తోంది. అందుకే ఆపిల్ iPhone 8, ఐఫోన్‌ల తదుపరి వేరియంట్‌ల కోసం iOS 16.0.2 అప్‌డేట్ రిలీజ్ చేసింది. దాదాపు 270MB సైజుతో వచ్చింది.

Apple’s iOS 16.0.2 update fixes bugs_ Check what has been fixed

Apple’s iOS 16.0.2 update fixes bugs_ Check what has been fixed

ఈ డివైజ్ సెటప్ సమయంలో డిస్‌ప్లే పూర్తిగా బ్లాక్ కనిపించడం, రీబూట్ చేసిన తర్వాత వాయిస్‌ఓవర్ అందుబాటులో ఉండకపోవడం, సర్వీసు తర్వాత కొన్ని iPhone మోడల్‌లలో టచ్ ఇన్‌పుట్ రెస్పాన్స్ ఇష్యూ వంటి అన్ని బగ్ ఇష్యూలను ఈ కొత్త అప్‌డేట్ ఫిక్స్ చేసింది. ఈ బగ్ ఇష్యూలు మాత్రమే కాకుండా, అప్‌డేట్ వంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది.

రీకాల్ చేసేందుకు Apple ఇటీవల ప్రారంభించిన iPhone 14 సిరీస్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన పాత iPhone మోడల్‌లపై iOS అప్‌డేట్స్ రిలీజ్ చేసింది. టెక్నాలజీ దిగ్గజం లేటెస్ట్ iPhone 14 సిరీస్ ప్రత్యేకంగా iOS 16.0.1 అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. ఈ అప్‌డేట్ కొత్త iPhone 14, iPhone 14 Pro మోడల్‌ల యాక్టివేషన్, మైగ్రేషన్‌ వంటి బగ్‌లను ఫిక్స్ చేయవచ్చు.

Read Also : Apple iOS 16.1 Update : ఆపిల్ లేటెస్ట్ iOS 16.1 అప్‌డేట్ చేశారా? మీ ఐఫోన్‌లో బ్యాటరీ పర్సంటేజ్ ఫీచర్ వచ్చింది.. చెక్ చేశారా?