Chinese astronauts spacewalk: చైనా కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ వాక్ చేసిన ఇద్దరు వ్యోమగాములు

చైనా వ్యోమగాములు కై జుజే, చెన్ డాంగ్ అంతరిక్ష కేంద్రం బయటివైపు పంపులు, డోరు తెరవడానికి హ్యాండిల్  వంటివి బిగించడానికి స్పేస్ వాక్ చేశారు. వారిద్దరికి చైనా స్పేస్ స్టేషన్ లోపలి వైపు నుంచి మరో వ్యోమగామి లియూ యాంగ్ సాయం చేశారు. చైనా అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఆరు నెలల్లో ఆ దేశ వ్యోమగాములు స్పేస్ వాక్ చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే చైనా కొత్త అంతరిక్ష కేంద్రంలోకి రెండు ప్రయోగశాలలను పంపింది.

Chinese astronauts spacewalk: చైనా కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ వాక్ చేసిన ఇద్దరు వ్యోమగాములు

Chinese astronauts spacewalk

Chinese astronauts spacewalk: చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి ఇద్దరు వ్యోమగాములు నిన్న స్పేస్ వాక్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో భాగస్వామ్యం కాకుండా చైనా సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. ఐఎస్ఎస్‌లోకి చైనా వ్యోమగాములను అమెరికా అనుమతించడం లేదు. ‘నాసా’కు సంబంధించిన డేటాను చైనాతో పంచుకునేందుకు అమెరికా చట్టాలు అనుకూలంగా లేవు. దీంతో ఐఎస్ఎస్‌లోకి చైనా వ్యోమగాములు వెళ్లకుండా అడ్డుకట్ట పడింది. చైనా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఈ ఏడాది డిసెంబరులోగా పూర్తి కానుంది.

ఈ నేపథ్యంలో చైనా వ్యోమగాములు కై జుజే, చెన్ డాంగ్ అంతరిక్ష కేంద్రం బయటివైపు పంపులు, డోరు తెరవడానికి హ్యాండిల్  వంటివి బిగించడానికి స్పేస్ వాక్ చేశారు. వారిద్దరికి చైనా స్పేస్ స్టేషన్ లోపలి వైపు నుంచి మరో వ్యోమగామి లియూ యాంగ్ సాయం చేశారు. చైనా అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సంబంధించి ఆరు నెలల్లో ఆ దేశ వ్యోమగాములు స్పేస్ వాక్ చేయడం ఇది రెండోసారి.

ఇప్పటికే చైనా కొత్త అంతరిక్ష కేంద్రంలోకి రెండు ప్రయోగశాలలను పంపింది. 23 టన్నుల ఆ తొలి మాడ్యూల్‌ను పంపిన చైనా ఈ ఏడాది చివరినాటికి మరో మాడ్యూల్ పంపాలని ప్రణాళికలు వేసుకుంది. సైన్స్ ల్యాబ్‌తోపాటు మరిన్ని మాడ్యూల్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. అంతరిక్షం విషయంలో చైనా పెట్టుకున్న లక్ష్యాల వల్ల తమకు సవాళ్లు ఎదురవుతాయని అమెరికా భావిస్తోంది. అంతరిక్షానికి మానవుడిని పంపిన మూడవ దేశంగా 2003లో చైనా నిలిచింది. అంతకుముందు ఆ ఘనతను సోవియట్ యూనియన్, అమెరికా సాధించాయి.

BiggBoss 6 Day 13 : బిగ్‌బాస్ సీజన్ 6.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఈ సారి డబల్ నామినేషన్.. కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయిన నాగ్..