Flipkart Big Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ఫ్లిప్‌కార్ట్ మెగా ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. 2022 ఏడాదిలో ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన సేల్ డిస్కౌంట్లను తీసుకొచ్చింది.

Flipkart Big Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Flipkart Big Bachat Dhamaal

Flipkart Big Dhamaal Sale : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. 2022 ఏడాదిలో ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన సేల్ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవలే ‘ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్’ నిర్వహించింది. కొత్తగా మరో భారీ సేల్‌తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Bachat Dhamaal Sale) “బిగ్ బచత్ ధమాల్” సేల్‌ ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిర్వహించనుంది.

మెగా సేల్‌లో ఫ్యాషన్ దుస్తులు, స్మార్ట్ టీవీలు, బ్యూటీ ప్రొడక్టులు, హోమ్, కిచెన్, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రత్యేకించి స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందించే స్మార్ట్ టీవీలపై ఏయే ఆఫర్లు, ఎంతెంత డిస్కౌంట్లు అందిస్తుందో చూద్దాం..

Mi 4A Pro : ఫ్లిప్ కార్ట్ అందించే మెగా సేల్‌లో ఆకర్షణీయమైన స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. చైనా బ్రాండ్ Mi కంపెనీ రిలీజ్ చేసిన Mi 4A Pro స్మార్ట్ టీవీ 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) ఉంటుంది. ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. దీని ధర డిస్కౌంట్ రూ.16,999తో ఆఫర్ చేస్తోంది.

వాస్తవానికి ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ.19,999గా ఉంది. ఈ స్మార్ట్ టీవీ మీద 15 శాతం తగ్గింపును పొందవచ్చు. Axis Bank Credit Cards వినియోగదారులు అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

SONY Bravia 108 cm (43 inches) : 
SONY Bravia స్మార్ట్ టీవీ ధర రూ. 39,999ల తగ్గింపు ధరకు పొందవచ్చు. ఈ టీవీ అసలు రూ. 44,990లు ఉండగా మెగా సేల్ సందర్భంగా డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అదనంగా, మీరు రూ. 5000, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 1500 వరకు సిటీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అదనంగా, Axis క్రెడిట్ కార్డ్, క్రెడిట్ EMI లావాదేవీలు ఫ్లాట్ రూ. 500 తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు.

OnePlus Y Series 100 cm (40 inch) :
OnePlus Y Series : వన్ ప్లస్ వై సిరీస్ 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.27,999 నుంచి రూ.22,499కు తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలపై అదనంగా రూ.2000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Vu Premium 139 cm (55 inches) :
Vu ప్రీమియం 139 cm (55 అంగుళాలు) ధర రూ. 36,999లకే సొంతం చేసుకోవచ్చు. రూ. 75వేల నుంచి భారీ తగ్గింపు ధరతో మీరు స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపును పొందవచ్చు. రూ.4999 వద్ద Google Nest Hub, రూ. 1999 వద్ద Google Nest Mini పొందవచ్చు. సిటీ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా ఫ్లాట్ రూ. 500 తగ్గింపు పొందవచ్చు. Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

LG 108 cm (43 inches) :
LG 108 cm (43 అంగుళాలు) ధర రూ. 36,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. అసలు ధర రూ. 59,990గా మార్కెట్లో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ప్రొడక్టులపై 38 శాతం తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, లెనోవో స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్‌పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను రూ. 2999కి పొందవచ్చు.

Realme 108 cm (43 అంగుళాలు) :
Realme 108 cm (43 అంగుళాలు) రూ. 32,999 నుంచి రూ. 28,999 వద్ద అందుబాటులో ఉంది. Flipkart Pay Later సైన్అప్ చేసుకోవచ్చు. రూ. 100 విలువైన Flipkart గిఫ్ట్ కార్డ్‌ని పొందవచ్చు. అదనంగా, మీరు సిటీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై రూ. 1500 వరకు 10 శాతం తగ్గింపు పొందవచ్చు. రూ. 5000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.

Read Also : Corona Update: భారత్ లో 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు, భారీగా తగ్గుతున్న కేసులు