Corona Update: భారత్ లో 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు, భారీగా తగ్గుతున్న కేసులు

భారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

Corona Update: భారత్ లో 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు, భారీగా తగ్గుతున్న కేసులు

Corona Update

Corona Update: భారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సోమ-మంగళ వారాల మధ్య దేశంలో కొత్తగా 1,67,059 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతకముందు రోజుతో పోలిస్తే 20 శాతం మేర కేసుల సంఖ్య పడిపోయింది. ఈమేరకు మంగళవారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1192 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో ఇప్పటివరకు భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,96,242 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 17,43,059 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివిటీ 11.69% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 15.25% శాతానికి పడిపోయింది.

Also Read: TDP Leader Vinod Jain : వేధించాను…కానీ ఇంతదాకా వస్తుందని అనుకోలేదు

సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య 2,54,076 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,92,30,198కు చేరింది. దేశంలో రికవరీ రేటు 94.60% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 14,28,672 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 73.06 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా 166.68 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రజలు వాక్సిన్ తీసుకోవాలని, ప్రభుత్వ సూచన మేరకు ఆవసరమైతే బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Also read: Realtor Kidnap : హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్టర్ కిడ్నాప్

మరోవైపు జనవరి చివరి వారం నుంచి వాక్సిన్ పంపణీ కాస్త నెమ్మదించింది. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ఫిబ్రవరి 1 నుంచి పలు రాష్ట్రాల్లో ఆంక్షలు సడలించారు. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చారు. ప్రయాణాల్లో, ఇతర జనసమూహాల్లో ప్రజలు తప్పక కరోనా నిబంధనలు పాటించాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.