Realtor Kidnap : హైదరాబాద్‌లో అర్ధరాత్రి రియల్టర్ కిడ్నాప్
హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఒక రియల్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది.

Realtor Kidnap in Hyderabad
Realtor Kidnap : హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఒక రియల్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి గం. 12-10 నిమిషాల సమయంలో కింగ్ కోటి లోని ఈడెన్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా(60) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఒక వివాహానికి హజరై ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడ్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకువెళ్లారు.
Also Read : Union Budget 2022 : నాల్గోసారి నిర్మలమ్మ బడ్జెట్.. నేడు పార్లమెంట్ ముందుకు..
సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.