Google Discover Feed : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఫీచర్.. భారతీయ యూజర్ల కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్..!

Google Discover Feed : గూగుల్ సెర్చ్ త్వరలో భారతీయ యూజర్ల (Indian Users) కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్‌ (Desktop Discover Feed)ని తీసుకొస్తోంది.

Google Discover Feed for users in India : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) డిస్కవర్ ఫీడ్‌ (Desktop Discover Feed)ను భారతీయ యూజర్ల కోసం డెస్క్‌టాప్‌లో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజీలో ఉంది. భారతీయ యూజర్లకు ఇంకా అందుబాటులో లేదు. గూగుల్ ఇండియా డెస్క్‌టాప్ హోమ్‌పేజీలో కొత్త డిస్కవర్ ఫీడ్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీడ్ యూజర్లకు రికమండ్ చేసిన (news headlines, weather forecasts, sports scores, stock information) వంటి కంటెంట్‌ను డిస్‌ప్లే చూపిస్తుంది.

కొత్త అప్‌డేట్‌పై గూగుల్ టెస్టింగ్ : 
గూగుల్ మొబైల్ హోమ్‌పేజీలో (Discover Feed) ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే, ఈ డెస్కవర్ ఫీడ్ ఫీచర్ డెస్క్‌టాప్‌లో టెస్టింగ్ చేయడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి అప్‌డేట్ గూగుల్ ప్రతినిధి లారా లెవిన్ ధృవీకరించారు. ప్రస్తుతం భారత్‌లో కొత్త అప్‌డేట్ టెస్టింగ్ జరుగుతోంది. టెస్టింగ్ సక్సెస్ అయితే, గూగుల్ భవిష్యత్తులో డెస్క్‌టాప్ యూజర్లందరికి డిస్కవర్ ఫీడ్‌ని అందజేయవచ్చు.

Read Also : Google Earthquake Alert System : భారతీయ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘భూకంప హెచ్చరిక వ్యవస్థ’.. రియల్ టైమ్ అప్‌డేట్స్ పంపుతుంది.. ఇదేలా పనిచేస్తుందంటే?

భారత్‌లో గూగుల్ గణనీయమైన మార్పు ఎందుకంటే.. ప్రపంచంలో అత్యధికంగా విజిట్ చేసే వెబ్‌సైట్‌లలో గూగుల్ హోమ్‌పేజీ (Google.com) ఒకటి. డిస్కవర్ ఫీడ్ మొదటిసారిగా 2018లో మొబైల్ డివైజ్‌లలో (Google US) హోమ్‌పేజీకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ గూగుల్ హోంపేజీ ప్రపంచవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వినియోగదారులకు వార్తలు (News), సంబంధిత (Related Stories) ట్రాక్ చేయడామే కాకుండా గూగుల్ సెర్చ్ (Google Search) వినియోగదారులకు మరింత ఆకర్షణీయమైన సమాచారాన్ని అందిస్తుంది.

Google Search discover feed on desktop

మొబైల్ డిస్కవర్ ఫీడ్ మాదిరిగానే :
మొబైల్ డివైజ్‌లలో కనిపించే అదే డిస్కవర్ ఫీడ్ (Mobile Discover Feed) ఇప్పుడు డెస్క్‌టాప్‌లోని సెర్చ్ బాక్స్ (Search Box) దిగువన కనిపిస్తోందని (MSPowerUser) నుంచి స్క్రీన్‌షాట్ వెల్లడించింది. కొంతమంది వినియోగదారులు ఈ ఫీచర్ ఉపయోగకరంగా భావించినప్పటికీ, డిస్కవరీ ఫీడ్ సాధారణంగా క్లీన్ గూగుల్ హోమ్‌పేజీకి రీడైరెక్ట్ అయ్యేందుకు వినియోగదారులకు ఇబ్బందిగా ఉండవచ్చునని ఓ నివేదిక చెబుతోంది. అయినప్పటికీ, టెస్టింగ్‌లో గూగుల్ (New Discover Feed)ని నిలిపివేయడానికి యూజర్లకు మార్గాన్ని అందించలేదు.

అదనంగా, గూగుల్ ప్రయోగాత్మక ఇంటర్‌ఫేస్ మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ (Bing)లో అందించే దానిలానే కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే వార్తా కథనాలు (News Headlines), ఇతర సమాచారాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, గూగుల్ మాదిరిగా కాకుండా, (Microsoft) దాని (Bing Users) యూజర్లకు వారి హోమ్‌పేజీని కస్టమైజ్ చేయడానికి న్యూ ఫీడ్‌ (News Feed)ను ఎనేబుల్ చేయలా? వద్దా? అని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

గూగుల్ ఏఐ సపోర్టు సెర్చ్ ఇంజిన్ : 
గూగుల్ ఇటీవల Search Generative Experience (SGE) కోసం టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి ఫొటోలను రూపొందించగల సామర్థ్యంతో సహా కొత్త ఫీచర్‌లను ప్రకటించింది. ఈ ఫీచర్ కొన్ని నెలల క్రితమే ప్రకటించిన Bings ఇమేజ్ క్రియేటర్‌ (Image Creator)ను పోలి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే.. గూగుల్ యూజర్ల కోసం AI- సపోర్టు సెర్చ్ జనరేటివ్ ఎక్స్‌పీరియన్స్(SGE)తో పనులను సులభతరం చేస్తుంది.

SGE అనేది యూజర్ల ప్రశ్నలకు మరింత సమగ్రమైన, సమాచార సమాధానాలను రూపొందించడానికి AIని ఉపయోగించే కొత్త టైప్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పవచ్చు. గూగుల్ సెర్చ్, ఇంటర్‌ఫేస్ సామర్థ్యాలతో SGEని అభివృద్ధి చేసింది. మరింత ఇంటరాక్టివ్‌గా, యూజర్లకు ఉపయోగకరంగా ఉండేలా కొత్త ఫీచర్‌లను అందిస్తుంది.

Read Also : Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ బ్రౌజర్ వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే.. మీ పీసీ కంట్రోల్ హ్యాకర్ల చేతుల్లోకి..!

ట్రెండింగ్ వార్తలు