Jio 5G Phone Launch : రిలయన్స్ జియో 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio 5G Phone Launch : ప్రముఖ రిలయన్స్ జియో మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. జియో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరిలో కంపెనీ AGM (వార్షిక సాధారణ సమావేశం)లో లాంచ్ చేయనుంది.

Jio 5G Phone Launch : రిలయన్స్ జియో 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio 5G Phone launch date, price, specifications, and everything else we know so far

Jio 5G Phone Launch : ప్రముఖ రిలయన్స్ జియో మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. జియో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల చివరిలో కంపెనీ AGM (వార్షిక సాధారణ సమావేశం)లో లాంచ్ చేయనుంది. టెలికాం దిగ్గజం జియోఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) పేరుతో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది లాంచ్ చేసింది. Jio 5G ఫోన్‌తో పాటు, టెలికాం ఆపరేటర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5G సర్వీసులను కనీసం ఎంపిక చేసిన నగరాలు లేదా ప్రాంతాల్లో లాంచ్ చేయాలని భావిస్తున్నారు.

Jio 5G ఫోన్ లాంచ్‌కు ముందు.. ధర, స్పెసిఫికేషన్‌లతో సహా చాలా విషయాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. గూగుల్‌తో కలిసి జియో సరసమైన 5G ఫోన్‌ను తీసుకొస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి. JioPhone Next లాగానే, Jio 5G ఫోన్ కూడా PragatiOSలో రన్ అవుతుందని తెలిపింది. రిలయన్స్ జియో 5G ఫోన్ గురించి ఇప్పటివరకు వివరాలను అధికారికంగా రివీల్ చేయలేదు.

Jio 5G Phone launch date, price, specifications, and everything else we know so far

Jio 5G Phone launch date, price, specifications, and everything else we know so far

Jio 5G ఫోన్ స్పెసిఫికేషన్స్ (అంచనా) :
నివేదికల ప్రకారం.. Jio 5G ఫోన్ HD+ క్వాలిటీతో 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ప్యానెల్ పరిశ్రమ-ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుందని తెలిపింది. రాబోయే Jio 5G ఫోన్ 4GB RAM, 32GB స్టోరేజీకి సపోర్టుతో ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌తో రానుంది. ఆండ్రాయిడ్ సెంట్రల్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ప్రగతిఓఎస్‌లో రన్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని జియో యాప్‌లతో పాటు గూగుల్ ప్లే సర్వీసెస్‌తో రానున్నాయి. Next జియో 5G ఫోన్ మునుపటి మోడల్ మాదిరిగానే అదే ఫీచర్లతో రానుందని అంచనా వేసింది.

అదనంగా, Jio 5G ఫోన్‌లో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే Google అసిస్టెంట్, రీడ్-అలౌడ్ టెక్స్ట్, Google Lens ద్వారా ఇన్‌స్టంట్ ట్రాన్సలేషన్ (Google Translate) వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ కనీసం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో రానుంది. Jio 5G ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుందని తెలిపింది. Jio 5G ఫోన్ 13-MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుందని తెలిపింది. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉందని తెలిపింది.

భారత్‌లో జియో 5G ఫోన్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో జియో 5G ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉంటుందని అంచనా. JioPhone Next 2021లో రూ. 6,499 రిటైల్ ధరతో విడుదలైంది. ఇప్పుడు 2022 జియో 5G ఫోన్ కూడా అదే రేంజ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Jio Phone 5G : రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?