Jio Phone 5G : రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. జియో ఫోన్ 5G (Jio Phone 5G) స్మార్ట్ ఫోన్ మోడల్.

Jio Phone 5G : రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Jio Phone 5G could launch in India soon_ Expected specifications and price

Jio Phone 5G : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. జియో ఫోన్ 5G (Jio Phone 5G) స్మార్ట్ ఫోన్ మోడల్. అతి త్వరలో భారత మార్కెట్లోకి జియో ఫోన్ 5G అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జియో ఫోన్ 5G లాంచ్ కానున్నట్టు లీక్ డేటా చెబుతోంది. టెలికాం దిగ్గజం మొదటి ఫోన్‌ను 2021లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్లో 5G లాంచ్‌కు దగ్గరగా ఉన్నందున ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది.

జియో మాత్రమే కాదు.. భారతీ ఎయిర్‌టెల్ కూడా భారత్‌లో ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాతిపదికన ఆగస్టులో 5Gని లాంచ్ చేయాలని భావిస్తున్నాయి. కానీ, ప్రస్తుతానికి, జియో ఫోన్ 5G భారత్‌లో ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు. అయితే ఈ Jio Phone 5G లాంచ్ దగ్గరలోనే ఉందని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే జియో ఫోన్ ఏయే ఫీచర్లతో రానుంది, ధర ఎంత ఉండొచ్చునేది అంచనాలను ఓసారి పరిశీలిద్దాం..

Jio Phone 5G : స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :

Jio ఫోన్ 5G HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. ఈ ప్యానెల్ ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుందని భావిస్తున్నారు. రిలయన్స్ జియో నుంచి రాబోయే 5G ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్‌తో రానుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదిక పేర్కొంది. 4GB RAM, 32GB వరకు స్టోరేజ్‌తో బ్యాకప్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 11 OSతో పనిచేయనుంది. Google Play సర్వీసులు, కొన్ని Jio యాప్‌లకు సపోర్టు చేసే అవకాశం ఉంది.

Jio Phone 5G could launch in India soon_ Expected specifications and price

Jio Phone 5G could launch in India soon_ Expected specifications and price

రాబోయే జియో ఫోన్ మునుపటి వెర్షన్‌తో మాదిరిగానే అదే ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. Google అసిస్టెంట్, రీడ్-అలౌడ్ టెక్స్ట్, Google Lens, Google Translate ద్వారా ఇన్‌స్టంట్ ట్రాన్సులేషన్ సహా మరిన్నింటిని కలిగి ఉంటుంది. రిలయన్స్ Jio ఫోన్ 5G హుడ్ కింద 5,000mAh బ్యాటరీతో రానుంది. కంపెనీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఫోటోగ్రఫీ కోసం.. 13-MP ప్రధాన కెమెరా, 2-MP మాక్రో కెమెరా ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ 8-MP సెల్ఫీ కెమెరాను చూడవచ్చు. 60fps వద్ద 1080p వీడియోలను, 120fps వద్ద 720p వీడియోలను రికార్డ్ చేయవచ్చు. బయోమెట్రిక్ ప్రామాణీకరణ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

Jio Phone 5G : ధర ఎంతంటే (అంచనా) :

భారత మార్కెట్లో రిలయన్స్ జియో ఫోన్ 5G ధర రూ. 10వేల లోపు ఉంటుందని అంచనా. జియో ఫోన్ 4G 2021లో రూ. 6,499 ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. రాబోయే జియో ఫోన్ 5G ధర కూడా ఇదే రేంజ్ లో ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.