Jio Plus Postpaid Family Plans : ‘జియో ప్లస్’ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్లు ఇవే.. ధర ఎంత? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే?

Jio Plus Postpaid Family Plans : టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ కస్టమర్ల కోసం జియో ప్లస్ (Jio Plus) సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌‌లను జియో యూజర్లు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు.

Jio Plus Postpaid Family Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ కస్టమర్ల కోసం జియో ప్లస్ (Jio Plus) సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ (Jio Postpaid Family Plans)లను జియో యూజర్లు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఒకే ప్లాన్ కింద గరిష్టంగా 4 మంది కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు. జియో ప్లస్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో భాగంగా మొత్తం కుటుంబానికి ఒకే బిల్లును అందిస్తోంది. డేటా, కంటెంట్ యాప్‌లు, మరిన్నింటిని షేర్ చేసేందుకు యూజర్లందరికి అనుమతిస్తుంది.

రిలయన్స్ జియో తమ యూజర్లను ఎప్పుడైనా కనెక్షన్‌ని రద్దు చేసుకునేందుకు అనుమతిస్తుంది. జియో ప్లస్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కింద రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి బేస్ ప్లాన్ ధర రూ. 399, రెండవ ప్లాన్ ధర రూ. 699గా ఉంది. రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ కాలింగ్, 75GB డేటా, అన్‌లిమిటెడ్ (SMS)లను పొందవచ్చు. ఈ ప్లాన్ వినియోగదారులకు ఒకే ప్లాన్ కింద 3 అదనపు సిమ్‌లను యాడ్-ఆన్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ OTT సర్వీసులకు ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్‌తో అందించదని గమనించాలి. జియో ప్లస్ రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, 100GB డేటా, అన్‌లిమిటెడ్ (SMS)లతో వస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా ఒక ఫ్యామిలీలోని నలుగురికి కేవలం రూ. 696లతోనే నెల మొత్తం మొబైల్ సర్వీసులు పొందవచ్చు. అంటే.. ఒక యూజర్ గరిష్టంగా 4 కొత్త కనెక్షన్‌లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌తో పూర్తిగా ఉచితంగా పోస్ట్‌పెయిడ్ సర్వీసులను పొందవచ్చు.  ఈ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో మొదటి వ్యక్తికి నెలకు రూ. 399 ఛార్జీలు వర్తిస్తాయి. అదనంగా తీసుకునే ప్రతీ కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 696లపై కనీస మొత్తం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Best Reliance Jio Plans : రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. హైస్పీడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఒక్కో సభ్యుడి నెలవారీ మొబైల్ ఖర్చు రూ. 174గా ఉంటుంది. ఇందులో మొత్తం ఫ్యామిలీకి ఒకే బిల్ వస్తుంది. ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవడం ద్వారా కుటుంబ సభ్యులు తమ డేటాను షేర్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ ఉండదు. జియో ట్రూ 5G వెల్ కం ఆఫర్ ద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటాను యాక్సస్ చేసుకోవచ్చు. జియో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా మొబైల్ నెంబర్ ఎంచుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఫ్రీగా పొందవచ్చు.

Jio Plus Postpaid Family Plans : Reliance Jio introduces Jio Plus postpaid Family plans

ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. యాడ్-ఆన్ సభ్యులకు అదనపు బెనిఫిట్స్ అందించడంతో పాటు రిలయన్స్ జియో (Reliance Jio) ఒకే ప్లాన్‌లో ప్రతి కుటుంబ సభ్యులకు అదనంగా 5GB డేటాను అందిస్తోంది. యాక్టివేషన్ సమయంలో రూ. 99/SIM ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉచిత ట్రయల్ తర్వాత యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్‌లకు నెలకు రూ. 99 ఛార్జీలు వర్తిస్తాయి.

(JioFiber) యూజర్లు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని గమనించండి. నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ (Amazon), జియోటీవీ (JioTV), జియో సినిమా (Jio Cinema) యాప్స్ చూడొచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర టెలీకాం సంస్థలకు చెందిన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు, SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మరో నెట్‌వర్క్ నుంచి ఈజీగా జియోకు పోర్ట్ కావొచ్చు.

జియో ప్లస్ (Jio Plus) కనెక్షన్ పొందాలంటే? :
జియో ప్లస్ కనెక్షన్ కోసం యూజర్లు 7000070000 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వాట్సాప్ లో పూర్తి వివరాలు మీకు అందుతాయి. (SIM Free Home) డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు కోసం సంబంధిత ఆప్షన్ ఎంచుకోవచ్చు. జియో ప్రీపెయిడ్ SIM వినియోగించే యూజర్లు కూడా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకోవచ్చు.

జియో యూజర్లు తమ ఫోన్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ అయిన మై జియో (MyJio) యాప్‌లోకి వెళ్లి ‘Prepaid to Postpaid’ ఆప్షన్ ఎంచుకోవాలి. OTP ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ ట్రయల్ ప్లాన్ ఎంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం జియో యూజర్లు www.jio.com/jioplus వెబ్ సైట్ విజిట్ చేయండి.

Read Also : Best Jio Plans March 2023 : రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

ట్రెండింగ్ వార్తలు