Best Jio Plans March 2023 : రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

Best Jio Plans March 2023 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. సరసమైన ప్లాన్లను కోరుకునే యూజర్ల కోసం ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Best Jio Plans March 2023 : రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఏ ప్లాన్ బెటర్ అంటే?

Best Jio Plans March 2023 _ Best Jio Plans under Rs 500 in March 2023_ Full list of plans, benefits and other details

Best Jio Plans March 2023 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. సరసమైన ప్లాన్లను కోరుకునే యూజర్ల కోసం ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వార్షిక ప్లాన్‌ (Annual Jio Plans) నుంచి నెలవారీ రీఛార్ల నుంచి చిన్న డేటా టాప్ అప్‌ల వరకు జియో అన్ని డేటా ప్లాన్లను అందిస్తుంది.

రూ. 500 బడ్జెట్ లోపు సరసమైన జియో ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం జియో ప్లాన్ల ఫుల్ లిస్టు అందిస్తోంది. జియో అందించే ఆఫర్ కింద Jio హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ కోసం రూ. 500 లోపు బెస్ట్ జియో ప్లాన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

జియో రూ. 500లోపు ప్లాన్‌లు ఇవే :
జియో రూ 119 ప్లాన్ : ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. 1.5GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 వరకు SMS, (JioTV, JioCinema, JioSecurity, JioCloud)తో సహా Jio యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

జియో రూ 149 ప్లాన్ :
20 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో జియో రోజువారీ 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, జియో యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

జియో రూ. 179 ప్లాన్ : ఈ ప్లాన్ కింద 1GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 24 రోజుల పాటు జియో యాప్‌ (Jio Apps)లకు యాక్సెస్ పొందవచ్చు.

జియో రూ. 199 ప్లాన్ : 23 రోజుల వ్యాలిడిటీతో పాటు ఈ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, Jio యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.

జియో రూ. 209 ప్లాన్ : వినియోగదారులు 1GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 28 రోజులపాటు జియో యాప్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Best Reliance Jio Plans : రిలయన్స్ జియో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. హైస్పీడ్ డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

జియో రూ. 239 ప్లాన్ : ఈ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో కలిపిజియో యాప్‌ బెనిఫిట్స్ అందిస్తుంది.

Best Jio Plans March 2023 _ Best Jio Plans under Rs 500 in March 2023_ Full list of plans, benefits and other details

Best Jio Plans March 2023 _ Best Jio Plans under Rs 500 in March 2023

జియో రూ 249 ప్లాన్ : ఈ ప్లాన్ 5G యూజర్ల కోసం జియో వెల్‌కమ్ ఆఫర్ (Jio Welcome Offer) కింద వస్తుంది. 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 23 రోజుల పాటు జియో యాప్‌లను అందిస్తుంది.

జియో రూ. 259 ప్లాన్ : ఈ ప్లాన్ కింద ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీని 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, జియో యాప్‌లకు యాక్సస్ అందిస్తుంది. జియో 5G వెల్‌కమ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ యాక్టివ్ ప్యాక్ వ్యాలిడిటీపై అర్హత కలిగిన జియో యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.

జియో రూ. 296 ప్లాన్ : ఈ ప్లాన్ గత ఏడాదిలో జియో ఫ్రీడమ్ ప్లాన్‌ల కింద ప్రవేశపెట్టింది. 30 రోజుల పాటు 25GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS పొందవచ్చు.

జియో రూ. 299 ప్లాన్ : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కేటగిరీ కింద బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌లలో ఇదొకటి. ఈ ప్లాన్ ద్వారా జియో 2GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 28 రోజుల వ్యాలిడిటీతో జియో యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.

జియో రూ 349 ప్లాన్ : జియో అందించే ప్లాన్లలో మరో ప్రీపెయిడ్ ప్లాన్ ఇది.. 2.5GB రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMS, 30 రోజుల పాటు జియో యాప్‌లకు యాక్సస్ పొందవచ్చు.

జియో రూ. 419 ప్లాన్ : ఈ ప్లాన్ కింద జియో యూజర్లు 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 28 రోజుల పాటు జియో యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

జియో రూ. 479 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో యూజర్లు తమ 1.5GB రోజువారీ ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Jio యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?