Oppo Reno 8 Lite 5G : ఒప్పో నుంచి రెనో 8 లైట్ సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Oppo Reno 8 Lite 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 లైట్ సిరీస్ వస్తోంది. అదే.. ఒప్పో రెనో 8 లైట్ వెర్షన్.. రెనో 8 సిరీస్‌లో ఇది నాల్గవ కొత్త స్మార్ట్‌ఫోన్..

Oppo Reno 8 Lite 5G : ఒప్పో నుంచి రెనో 8 లైట్ సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Oppo Reno 8 Lite 5g Price, Specifications Leaked Ahead Of Official Launch (1)

Oppo Reno 8 Lite 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 లైట్ సిరీస్ వస్తోంది. అదే.. ఒప్పో రెనో 8 లైట్ వెర్షన్.. (Oppo Reno 8 Lite) రెనో 8 సిరీస్‌లో ఇది నాల్గవ కొత్త స్మార్ట్‌ఫోన్.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. లాంచింగ్ కాకముందే ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లు, కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం చూస్తే.. రెనో 7Z 5G స్మార్ట్ ఫోన్‌గా సూచిస్తున్నాయి. స్పెసిఫికేషన్స్‌తో పాటు, ఫోన్ ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఒప్పో రెనో 8 లైట్ 5G, 6.43-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ప్రకారం.. లీకైన ఫీచర్లలో ఫోన్ స్క్రీన్ 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉండనుంది. ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో టాప్ లెఫ్ట్ కార్నర్‌ వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. Reno 8 Lite 5G Qualcomm Snapdragon 695 SoC నుంచి పవర్ అందిస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. ఇక మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీ సపోర్టు అందిస్తుంది. ఈ డివైజ్ 4500 mAh బ్యాటరీని అందిస్తుంది. Reno 8 Lite బాక్స్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ColorOS 12.1 కలిగి ఉంది.

Oppo Reno 8 Lite 5g Price, Specifications Leaked Ahead Of Official Launch

Oppo Reno 8 Lite 5g Price, Specifications Leaked Ahead Of Official Launch

కెమెరాల విషయానికి వస్తే.. రెనో 8 లైట్ 5G ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఫోన్‌లో 64MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. డెప్త్ మ్యాపింగ్ మాక్రో షూటింగ్ కోసం రెండు 2MP సెన్సార్‌లు ఉన్నాయి. లీకైన ఫీచర్ల ప్రకారం.. అల్ట్రావైడ్ కెమెరా లేదు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. రెనో 8 లైట్ 5G 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

EUR 305 (దాదాపు రూ. 25,500) ప్రారంభ ధరతో యూరప్‌లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ పేర్కొంది. రెనో 8 సిరీస్‌లోని 3 స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ కొన్ని రోజుల క్రితమే చైనాలో రిలీజ్ చేసింది. ఇందులో వనిల్లా ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో రెనో 8 ప్రో+ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వచ్చే జూన్‌లో ఒప్పో రెనో 8, రెనో 8 ప్రోలను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.

Read Also :  iQOO Neo 6 : iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ 5G ఫోన్.. ఇండియాలో ధర ఎంతంటే?